Annidaa nerubari ade yaadam deṟumgamdaa

అన్నిటా నేరుపరి అదే యాతఁ డెఱుఁగఁడా
Language

(॥పల్లవి॥)
అన్నిటా నేరుపరి అదే యాతఁ డెఱుఁగఁడా
విన్నవించరే యా మాట వేడుక లాతనికి

(॥॥)
యెవ్వరి నేమన నేల యెడ మాట లాడ నేల
నవ్వుతా నా రమణుఁడే న న్నేలీఁ గాక
సువ్వన నా మనసు యిక పాఁతర యెంతని
తవ్వెను తానే దయ దలఁచీఁ గాకా

(॥॥)
చెక్కున చేయిడ నేల చింతలఁ బొరల నేల
మక్కువ నాతఁడే వచ్చి మన్నించీఁ గాకా
గుక్కక నా దీమసము గోడవంటిది యెంతని
మక్కు వేసే తానే చూచి మమ్ముఁ గాచీఁ గాకా

(॥॥)
సెలవి నవ్వఁగ నేల సిగ్గులు వడఁగ నేల
వెలయఁ గూడె నన్ను శ్రీ వేంకటేశుఁడే
చిలుక వంటిది నాలోఁ జెలఁ గే యాస యేమని
పిలిచేను నాపైఁ దానే ప్రేమ నించీఁ గాకా

(||pallavi||)
anniḍā nerubari ade yādam̐ ḍĕṟum̐gam̐ḍā
vinnaviṁchare yā māḍa veḍuga lādanigi

(||||)
yĕvvari nemana nela yĕḍa māḍa lāḍa nela
navvudā nā ramaṇum̐ḍe na nnelīm̐ gāga
suvvana nā manasu yiga pām̐tara yĕṁtani
tavvĕnu tāne daya dalam̐sīm̐ gāgā

(||||)
sĕkkuna seyiḍa nela siṁtalam̐ bŏrala nela
makkuva nādam̐ḍe vachchi manniṁchīm̐ gāgā
gukkaga nā dīmasamu goḍavaṁṭidi yĕṁtani
makku vese tāne sūsi mammum̐ gāsīm̐ gāgā

(||||)
sĕlavi navvam̐ga nela siggulu vaḍam̐ga nela
vĕlayam̐ gūḍĕ nannu śhrī veṁkaḍeśhum̐ḍe
siluga vaṁṭidi nālom̐ jĕlam̐ ge yāsa yemani
pilisenu nābaim̐ dāne prema niṁchīm̐ gāgā