అన్నిటా నేర్పరివి నీ వౌదువయ్యా
(॥పల్లవి॥)
అన్నిటా నేర్పరివి నీ వౌదువయ్యా
యెన్ని ప్రియములు చెప్పే వేమి సేతువయ్యా
(॥అన్ని॥)
మక్కువ చల్లనే పట్టె మాటలాడనే పట్టె
వెక్కసాన నీతో నవ్వ వేళ లేదు
యిక్కువలు గరఁగతి యింపులనే పెరిగితి
యెక్కడ నీవు దనియ వేమి సేతువయ్యా
(॥అన్ని॥)
మోము చూడనే పట్టె మోము నించనే పట్టె
వేమరుఁ జేయెత్తి మొక్క వేళ లేదు
నామనసు నీ కిచ్చితి నాఁడె నిన్ను మెచ్చితి
యేమిటికిఁ వేవు యేమి సేతువయ్యా
(॥అన్ని॥)
కదిసి వుండనె పట్టె కాఁగిలించనె పట్టి
వెదకి దూరు వేయఁగ వేళ లేదు
యిదివో శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
యెదుటనె వున్నాఁడ వేమి సేతువయ్యా
(||pallavi||)
anniḍā nerbarivi nī vauduvayyā
yĕnni priyamulu sĕppe vemi seduvayyā
(||anni||)
makkuva sallane paṭṭĕ māḍalāḍane paṭṭĕ
vĕkkasāna nīdo navva veḽa ledu
yikkuvalu garam̐gadi yiṁpulane pĕrigidi
yĕkkaḍa nīvu daniya vemi seduvayyā
(||anni||)
momu sūḍane paṭṭĕ momu niṁchane paṭṭĕ
vemarum̐ jeyĕtti mŏkka veḽa ledu
nāmanasu nī kichchidi nām̐ḍĕ ninnu mĕchchidi
yemiḍigim̐ vevu yemi seduvayyā
(||anni||)
kadisi vuṁḍanĕ paṭṭĕ kām̐giliṁchanĕ paṭṭi
vĕdagi dūru veyam̐ga veḽa ledu
yidivo śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
yĕduḍanĕ vunnām̐ḍa vemi seduvayyā