Annidaa nerbarivi nee kaadamdu meluvaamdu

అన్నిటా నేర్పరివి నీ కాతఁడు మేలువాఁడు
Language

(॥పల్లవి॥)
అన్నిటా నేర్పరివి నీ కాతఁడు మేలువాఁడు
నిన్నుఁ బాయకుండి యిట్టె నెలకొనుఁగాక

(॥అన్ని॥)
నినుపులై తేనెలూరే నీమాఁటలు విని
యెనసి మన్నించక యెట్టుండునే
చెనకుల కొనగోరి చేతి మొక్కు లందుకొని
వొనరి మతిగరఁగ కూర కెట్ల నుండునే

(॥అన్ని॥)
పసిఁడి కుండలవంటి బలు నీగుబ్బలు సోఁకి
వసమౌనే కదే నీకు వలచి తాను
ముసిముసి నీనవ్వులు ముందరఁ బొలసితేను
పొసఁగి మరుగుఁ గదె పొంతనుండి నీకు

(॥అన్ని॥)
నెమ్మి శ్రీవేంకటేశుఁడు నీ చక్కఁదనము చూచి
వుమ్మడిఁ బెండ్లాడినది వొప్పిద మౌనె
సమ్మతించి నీమోవి చవిగొనినట్టవాఁడు
కమ్మటి నీకాఁగిటికే కాణాచియౌనే

(||pallavi||)
anniḍā nerbarivi nī kādam̐ḍu meluvām̐ḍu
ninnum̐ bāyaguṁḍi yiṭṭĕ nĕlagŏnum̐gāga

(||anni||)
ninubulai tenĕlūre nīmām̐ṭalu vini
yĕnasi manniṁchaga yĕṭṭuṁḍune
sĕnagula kŏnagori sedi mŏkku laṁdugŏni
vŏnari madigaram̐ga kūra kĕṭla nuṁḍune

(||anni||)
pasim̐ḍi kuṁḍalavaṁṭi balu nīgubbalu som̐ki
vasamaune kade nīgu valasi tānu
musimusi nīnavvulu muṁdaram̐ bŏlasidenu
pŏsam̐gi marugum̐ gadĕ pŏṁtanuṁḍi nīgu

(||anni||)
nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍu nī sakkam̐danamu sūsi
vummaḍim̐ bĕṁḍlāḍinadi vŏppida maunĕ
sammadiṁchi nīmovi savigŏninaṭṭavām̐ḍu
kammaḍi nīgām̐giḍige kāṇāsiyaune