Annidaa nerajaanamdaina naayagumdu taanu

అన్నిటా నెరజాణఁడైన నాయకుఁడు తాను
Language

(॥పల్లవి॥)
అన్నిటా నెరజాణఁడైన నాయకుఁడు తాను
సన్నల చాయలఁ దానే సరిచూడుమనవే

(॥॥)
మనసులోని వలపు మాటలలోనే తోఁచు
తనువుపై వేడుకలు తమియై రేఁగు
కనుచూపులలో యాస కడఁగు జాగరములై
తనకు నేఁ జెప్పనేల తలఁచుకొమ్మనవే

(॥॥)
మొలచినసిగ్గులు ముసిముసినవ్వుల లౌను
నెలకొన్నతలపోఁ త నిట్టూర్పు లగును
చెలఁ గి యెడమాటలు చిగిరించుఁ గోరికలై
తిలకించి నాభావము తెలుసుకోమ్మనవే

(॥॥)
చిప్పిలుఁ గళలతేట చిందు మోవితేనియలై
చెప్పరాని సంతోసము చెమటలౌను
యిప్పుడె నన్నేలినాఁ డు ఇదె శ్రీవేంకటేశుఁ డు
యొప్పటికి నిదేమాట యెరుఁగకొమ్మనవే

(||pallavi||)
anniḍā nĕrajāṇam̐ḍaina nāyagum̐ḍu tānu
sannala sāyalam̐ dāne sarisūḍumanave

(||||)
manasuloni valabu māḍalalone tom̐su
tanuvubai veḍugalu tamiyai rem̐gu
kanusūbulalo yāsa kaḍam̐gu jāgaramulai
tanagu nem̐ jĕppanela talam̐sugŏmmanave

(||||)
mŏlasinasiggulu musimusinavvula launu
nĕlagŏnnadalabom̐ ta niṭṭūrbu lagunu
sĕlam̐ gi yĕḍamāḍalu sigiriṁchum̐ gorigalai
tilagiṁchi nābhāvamu tĕlusugommanave

(||||)
sippilum̐ gaḽaladeḍa siṁdu movideniyalai
sĕpparāni saṁtosamu sĕmaḍalaunu
yippuḍĕ nannelinām̐ ḍu idĕ śhrīveṁkaḍeśhum̐ ḍu
yŏppaḍigi nidemāḍa yĕrum̐gagŏmmanave