Annidaa neeve vumdunamduvu gaana

అన్నిటా నీవే వుందునందువు గాన
Language

(॥పల్లవి॥)
అన్నిటా నీవే వుందునందువు గాన
యిన్ని నీవు పుట్టించిన వివి నీసొమ్ములే

(॥అన్ని॥)
నిలిచిన రూపులెల్లా నీగుళ్లుగాఁ దలఁతు
మెలఁగేటి చైతన్యము మిమ్ముగాఁ దలఁతు
యిలలోని ధ్వనులు నీపలుకులుగాఁ దలఁతు
సకల పంచభూతా లుపకరణాలుగాఁ దలఁతు

(॥అన్ని॥)
నారుకొన్న పంటలు నీనైవేద్యాలుగాఁ దలఁతు
నీరెల్లా నీతీర్థమని నెమ్మిఁదలఁతు
ధారుణి భోగాలు పూజాద్రవ్యాలుగాఁ దలఁతు
నేరిచిన పనులెల్లా నీలీలలుగాఁ దలఁతును

(॥అన్ని॥)
కాలత్రయము నీగతులుగానే తలఁతు
చాలి సురల నీయనుచరులఁగానే తలఁతు
నాలోని శ్రీవేంకటేశ నాతండ్రివని తలఁతు
తాలిమి నీదేవులను తల్లియని తలఁతును

(||pallavi||)
anniḍā nīve vuṁdunaṁduvu gāna
yinni nīvu puṭṭiṁchina vivi nīsŏmmule

(||anni||)
nilisina rūbulĕllā nīguḽlugām̐ dalam̐tu
mĕlam̐geḍi saidanyamu mimmugām̐ dalam̐tu
yilaloni dhvanulu nībalugulugām̐ dalam̐tu
sagala paṁchabhūdā lubagaraṇālugām̐ dalam̐tu

(||anni||)
nārugŏnna paṁṭalu nīnaivedyālugām̐ dalam̐tu
nīrĕllā nīdīrdhamani nĕmmim̐dalam̐tu
dhāruṇi bhogālu pūjādravyālugām̐ dalam̐tu
nerisina panulĕllā nīlīlalugām̐ dalam̐tunu

(||anni||)
kālatrayamu nīgadulugāne talam̐tu
sāli surala nīyanusarulam̐gāne talam̐tu
nāloni śhrīveṁkaḍeśha nādaṁḍrivani talam̐tu
tālimi nīdevulanu talliyani talam̐tunu