Annidaa neegum bunyamayyeem gaani

అన్నిటా నీకుఁ బుణ్యమయ్యీఁ గాని
Language

(॥పల్లవి॥)
అన్నిటా నీకుఁ బుణ్యమయ్యీఁ గాని
మన్నించి నా తాపము మానుపరాదా

(॥అన్ని॥)
తలపోఁత ఘనమాయ తత్తర మాఁపఁగరాదు
అలిగి నీతోఁ బాసినప్పటనుండి
వలికితి నీతోను పంతము లిచ్చితి నీకు
మలసిననావెద మానుపరాదా

(॥అన్ని॥)
కూచుండ సయించరాదు గుట్టున నుండఁగరాదు
ఆచాయ మారుమోమయినప్పటనుండి
చేచేత వద్ద నుందాన చేతు లెత్తి మొక్కితిని
కాచుకొని నన్నిఁకఁ గరుణించరాదా

(॥అన్ని॥)
చెప్పిరాదు విరము సిగ్గులు బాయిటఁ బడె
అప్పసము వాదడిచినప్పటనుండి
ముప్పిరి శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
దప్పిదేరె నిఁక నన్ను దయఁ జూడరాదా

(||pallavi||)
anniḍā nīgum̐ buṇyamayyīm̐ gāni
manniṁchi nā tābamu mānubarādā

(||anni||)
talabom̐ta ghanamāya tattara mām̐pam̐garādu
aligi nīdom̐ bāsinappaḍanuṁḍi
valigidi nīdonu paṁtamu lichchidi nīgu
malasinanāvĕda mānubarādā

(||anni||)
kūsuṁḍa sayiṁcharādu guṭṭuna nuṁḍam̐garādu
āsāya mārumomayinappaḍanuṁḍi
seseda vadda nuṁdāna sedu lĕtti mŏkkidini
kāsugŏni nannim̐kam̐ garuṇiṁcharādā

(||anni||)
sĕppirādu viramu siggulu bāyiḍam̐ baḍĕ
appasamu vādaḍisinappaḍanuṁḍi
muppiri śhrī veṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
dappiderĕ nim̐ka nannu dayam̐ jūḍarādā