అన్నిటా నే గురిగాక అవి యేమి చేసె నీకు
(॥పల్లవి॥)
అన్నిటా నే గురిగాక అవి యేమి చేసె నీకు
మన్నించరాదా వట్టి మచ్చికలు చూపక
(॥॥)
వొక్కటఁ జంద్రోదయాన నుడు కెత్తి వున్నవవి
జక్కవచన్నుల నేల సారెఁ బట్టేవు
ముక్కుసంపెంగతావికి ముందే బ్రమసి వున్నవి
నిక్కి తుమ్మెదకురుల నీవేల రేఁచేవు
(॥॥)
ఘనవిరహపు టెండఁ గాకరేఁగి వున్నవవి
కనుచకోరాల నేల గాసి చేసేవు
చినుకుఁ జెమటలచే చీకాకు పడినవవి
చననీక నడపుటంచల నేల యించేవు
(॥॥)
బలిమి రామా యను పిలుపుల లోఁగినవి
యెలుఁగుఁగోయిలల నేలలయించేవు
కలసితి నన్ను శ్రీవేంకటేశ పాఁపసెజ్జను
పెలుచు గొప్పునెమలిపెంచె మేలంటేవు.
(||pallavi||)
anniḍā ne gurigāga avi yemi sesĕ nīgu
manniṁcharādā vaṭṭi machchigalu sūbaga
(||||)
vŏkkaḍam̐ jaṁdrodayāna nuḍu kĕtti vunnavavi
jakkavasannula nela sārĕm̐ baṭṭevu
mukkusaṁpĕṁgadāvigi muṁde bramasi vunnavi
nikki tummĕdagurula nīvela rem̐sevu
(||||)
ghanavirahabu ṭĕṁḍam̐ gāgarem̐gi vunnavavi
kanusagorāla nela gāsi sesevu
sinugum̐ jĕmaḍalase sīgāgu paḍinavavi
sananīga naḍabuḍaṁchala nela yiṁchevu
(||||)
balimi rāmā yanu pilubula lom̐ginavi
yĕlum̐gum̐goyilala nelalayiṁchevu
kalasidi nannu śhrīveṁkaḍeśha pām̐pasĕjjanu
pĕlusu gŏppunĕmalibĕṁchĕ melaṁṭevu.