అన్నిటా నా గుణమెల్లా నాతఁ డెఱుఁగు
(॥పల్లవి॥)
అన్నిటా నా గుణమెల్లా నాతఁ డెఱుఁగు
నిన్ను మెప్పించ నేర్చిన నెరజాణ నేను
(॥అన్ని॥)
రెప్పలెత్తి చూచి నీవు రేసులు వుటించకువే
యెప్పుడు రమణునికి ఇల్లాల నేను
చప్పనిమాట లాడి చవులు దప్చించకువే
చిప్పిల నీతో సొగుసేసిన దాన నేను
(॥అన్ని॥)
సెలవుల నవ్వునవ్వి సిగ్గులువరచకువే
తలఁపులో నుండే మేనదాన నేను
బలిమిఁ బట్టి పెనఁగి బయలీఁదించకువే
చలములకైతే నీతో సరిదాన నేను
(॥అన్ని॥)
మరిగించి నీ వింత మనసు సోదించకువే
తిరమై శ్రీవేంకటేశుదేవుల నేను
పొరి నీ వాతనిఁ గూడి పొత్తులు గలపకువే
సిరుల నీ కొద్దికైన చెల్లెల నేను
(||pallavi||)
anniḍā nā guṇamĕllā nādam̐ ḍĕṟum̐gu
ninnu mĕppiṁcha nersina nĕrajāṇa nenu
(||anni||)
rĕppalĕtti sūsi nīvu resulu vuḍiṁchaguve
yĕppuḍu ramaṇunigi illāla nenu
sappanimāḍa lāḍi savulu dapchiṁchaguve
sippila nīdo sŏgusesina dāna nenu
(||anni||)
sĕlavula navvunavvi sigguluvarasaguve
talam̐pulo nuṁḍe menadāna nenu
balimim̐ baṭṭi pĕnam̐gi bayalīm̐diṁchaguve
salamulagaide nīdo saridāna nenu
(||anni||)
marigiṁchi nī viṁta manasu sodiṁchaguve
tiramai śhrīveṁkaḍeśhudevula nenu
pŏri nī vādanim̐ gūḍi pŏttulu galabaguve
sirula nī kŏddigaina sĕllĕla nenu