Annidaa mee vaarame anumaanimchamgavaddu

అన్నిటా మీ వారమే అనుమానించఁగవద్దు
Language

(॥పల్లవి॥)
అన్నిటా మీ వారమే అనుమానించఁగవద్దు
యెన్నికలు సరివచ్చె నీవయ్య చనవు

(॥॥)
పచ్చిసేసేదాననా బాఁతితోడ నీవలపు
తచ్చి తచ్చి దాఁచుకొనేదానఁగాక
మచ్చములుగ నేనంటా మరి నాకేల లోఁగేవు
రచ్చవేయఁ జేఁత లిట్టె రావయ్య నావద్దకి

(॥॥)
నవ్వేటిదాననా ననిచి నీసుద్దులెల్లా
దవ్వుల వంకలుదిద్దేదానఁ గాక
యెవ్వరు నెరఁగకుండా నేకాంతమేలాడేవు
వువ్విళ్లూరఁ గాఁతాళించ నుండవయ్య యీడను

(॥॥)
సిగ్గువరచేదాననా చేరి నీకాఁగిటఁ గూడి
తగ్గనిరతుల మెచ్చేదానఁ గాక
నిగ్గుల శ్రీవేంకటేశ నీవేల వేఁడుకొనేవు
యెగ్గుపట్ట నన్ను నిట్టె యేలవయ్య యిపుడు

(||pallavi||)
anniḍā mī vārame anumāniṁcham̐gavaddu
yĕnnigalu sarivachchĕ nīvayya sanavu

(||||)
pachchisesedānanā bām̐tidoḍa nīvalabu
tachchi tachchi dām̐sugŏnedānam̐gāga
machchamuluga nenaṁṭā mari nāgela lom̐gevu
rachchaveyam̐ jem̐ta liṭṭĕ rāvayya nāvaddagi

(||||)
navveḍidānanā nanisi nīsuddulĕllā
davvula vaṁkaludiddedānam̐ gāga
yĕvvaru nĕram̐gaguṁḍā negāṁtamelāḍevu
vuvviḽlūram̐ gām̐tāḽiṁcha nuṁḍavayya yīḍanu

(||||)
sigguvarasedānanā seri nīgām̐giḍam̐ gūḍi
tagganiradula mĕchchedānam̐ gāga
niggula śhrīveṁkaḍeśha nīvela vem̐ḍugŏnevu
yĕggubaṭṭa nannu niṭṭĕ yelavayya yibuḍu