Annidaa jaanavu neevu aduvamtivaamdavaa

అన్నిటా జాణవు నీవు అటువంటివాఁడవా
Language

(॥పల్లవి॥)
అన్నిటా జాణవు నీవు అటువంటివాఁడవా
కన్నపనులకుఁ దారుకాణలేలయ్యా

(॥॥)
తెలిసె నీమాటలు తేటతెల్లమిగాను
చెలులెల్ల నాతోనుఁ జెప్పనప్పుడే
అలుకలన్నియుఁ దేరె నన్నిటా సంతోసమాయ
యెలమి నింతేసి యాస లేల పట్టేవయ్యా

(॥॥)
కంటిమి నీగుణములు కన్నుల పండుగగాను
యింటికి నీవే వచ్చి యెచ్చరించఁగా
జంటలైతి మిద్దరము చక్కనాయఁ బనులెల్ల
వంటుచేసి న్నునెంత నమ్మించేవయ్యా

(॥॥)
మెచ్చితి నీనేరుపులు మేనఁ బులకలు నిండ
కచ్చువెట్టి నన్ను గూడి కాఁగిలించంగా
మచ్చిక శ్రీవేంకటేశ మనసు లొక్కటులాయ
యిచ్చగించ నీ నిజాలు యెంతచెప్పేవయ్యా

(||pallavi||)
anniḍā jāṇavu nīvu aḍuvaṁṭivām̐ḍavā
kannabanulagum̐ dārugāṇalelayyā

(||||)
tĕlisĕ nīmāḍalu teḍadĕllamigānu
sĕlulĕlla nādonum̐ jĕppanappuḍe
alugalanniyum̐ derĕ nanniḍā saṁtosamāya
yĕlami niṁtesi yāsa lela paṭṭevayyā

(||||)
kaṁṭimi nīguṇamulu kannula paṁḍugagānu
yiṁṭigi nīve vachchi yĕchchariṁcham̐gā
jaṁṭalaidi middaramu sakkanāyam̐ banulĕlla
vaṁṭusesi nnunĕṁta nammiṁchevayyā

(||||)
mĕchchidi nīnerubulu menam̐ bulagalu niṁḍa
kachchuvĕṭṭi nannu gūḍi kām̐giliṁchaṁgā
machchiga śhrīveṁkaḍeśha manasu lŏkkaḍulāya
yichchagiṁcha nī nijālu yĕṁtasĕppevayyā