Annidaa jaanavauduvu aubhaleshvara

అన్నిటా జాణవౌదువు ఔభళేశ్వర
Language

(॥పల్లవి॥)
అన్నిటా జాణవౌదువు ఔభళేశ్వర
యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము

(॥అన్ని॥)
మారుగొండలపైనుండి మగువఁ బాయఁగ లేక
కోరి వచ్చితి విందిరగుడిలోనికి
ఆరితేరినదేవుఁడ వగ్గ ళ్ళురుకుదురా
యేరీతివారికైనా నిటుపండు మోహము

(॥అన్ని॥)
నడుమను భవనాళినది వారుచుండఁగాను
కడు దాఁటి వచ్చితివి కాంత యింటికి
వడిఁ బారఁగా నేరీఁది వత్తురా సాహసమున
యెడయ కెవ్వరికై నా నిట్టుండు మోహము

(॥అన్ని॥)
యెదరుగద్దెల నెక్కి యెక్కుడు తమకమున
కదిసి కూచుంటి వింతిగద్దెమీఁదను
పొదిగి శ్రీవేంకటేశ పూఁచి మేరమీరుదురా
యెదలో నెవ్వరికై నా నిట్టుండు మోహము

(||pallavi||)
anniḍā jāṇavauduvu aubhaḽeśhvara
yĕnni sūsugŏṁṭenu iṭṭuṁḍu mohamu

(||anni||)
mārugŏṁḍalabainuṁḍi maguvam̐ bāyam̐ga lega
kori vachchidi viṁdiraguḍilonigi
āriderinadevum̐ḍa vagga ḽḽurugudurā
yerīdivārigainā niḍubaṁḍu mohamu

(||anni||)
naḍumanu bhavanāḽinadi vārusuṁḍam̐gānu
kaḍu dām̐ṭi vachchidivi kāṁta yiṁṭigi
vaḍim̐ bāram̐gā nerīm̐di vatturā sāhasamuna
yĕḍaya kĕvvarigai nā niṭṭuṁḍu mohamu

(||anni||)
yĕdarugaddĕla nĕkki yĕkkuḍu tamagamuna
kadisi kūsuṁṭi viṁtigaddĕmīm̐danu
pŏdigi śhrīveṁkaḍeśha pūm̐si meramīrudurā
yĕdalo nĕvvarigai nā niṭṭuṁḍu mohamu