Annidaa jaanavaidi vappude neevu

అన్నిటా జాణవైతి వప్పుడే నీవు
Language

(॥పల్లవి॥)
అన్నిటా జాణవైతి వప్పుడే నీవు
యెన్నేసి చేఁతలు సే సే విసుమంతదానవు

(॥అన్ని॥)
మాటలా డనేరుతువే మగనితో సారెసారె
వీటుచూపనేరుతువే నిలుచుండి
గూఁటముగా నిన్నుఁ జూచి కడువెరగయ్యా నాకు
యీటుతో రట్టడివైతి విసుమంతదానవు

(॥అన్ని॥)
చెనకంగనేరుతువే చేతులారా నీవిభుని
వినయాలు నేరుతువే వేవేలుగాను
ఘనముగా నవ్వే నీవు కత గరచినందుకు
యెన సెంత జూటవైతి విసుమంతదానవు

(॥అన్ని॥)
చేరి మొక్కనేరుతువే శ్రీవేంకటేశ్వరునికి
కూరిమితోఁ గాంగిలించి కూడనేర్తువే
యారీతి నన్నితఁ డేలె యిందుకే నాకరుదయ్యా
యేరుపరచకువే నీ విసుమంతదానవు

(||pallavi||)
anniḍā jāṇavaidi vappuḍe nīvu
yĕnnesi sem̐talu se se visumaṁtadānavu

(||anni||)
māḍalā ḍaneruduve maganido sārĕsārĕ
vīḍusūbaneruduve nilusuṁḍi
gūm̐ṭamugā ninnum̐ jūsi kaḍuvĕragayyā nāgu
yīḍudo raṭṭaḍivaidi visumaṁtadānavu

(||anni||)
sĕnagaṁganeruduve sedulārā nīvibhuni
vinayālu neruduve vevelugānu
ghanamugā navve nīvu kada garasinaṁdugu
yĕna sĕṁta jūḍavaidi visumaṁtadānavu

(||anni||)
seri mŏkkaneruduve śhrīveṁkaḍeśhvarunigi
kūrimidom̐ gāṁgiliṁchi kūḍanerduve
yārīdi nannidam̐ ḍelĕ yiṁduge nāgarudayyā
yerubarasaguve nī visumaṁtadānavu