Annidaa jaanamdu taanu aamtadaana nimte nenu

అన్నిటా జాణఁడు తాను ఆఁటదాన నింతే నేను
Language

(॥పల్లవి॥)
అన్నిటా జాణఁడు తాను ఆఁటదాన నింతే నేను
విన్నపములా ఇఁక వెస నెచ్చరించేవి

(॥అన్ని॥)
యిట్టె తా నిన్ను మన్నించి యేలితే నేలెఁగాక నా
వట్టి వినయములా వలపించేవి
చుట్టమై తా వచ్చితేనే సులభమౌఁగాక నా
దిట్టచేఁతలా తన్నుఁ దెమలించేవి

(॥అన్ని॥)
సన్నెరిఁగి తానే నాతో సరస మానుత గాక
కన్నుల మొక్కులా తన్నుగరఁగించేవి
నన్ను నాదరించి తానే నవ్వితే నవ్వెఁగాక నా
చన్నుల మొనలా తన్ను సాదించేవి

(॥అన్ని॥)
గొనకొని తానే నన్నుఁ గూడితేఁ గూడెఁగాక నా
పెనఁగు లాటలా తన్నుఁ బెడరేఁచేవి
యెనసెను శ్రీ వేంకటేశుఁడు తానే నన్ను
చెనకులా తన్ను నేఁడు చిమ్మిరేఁచేవి

(||pallavi||)
anniḍā jāṇam̐ḍu tānu ām̐ṭadāna niṁte nenu
vinnabamulā im̐ka vĕsa nĕchchariṁchevi

(||anni||)
yiṭṭĕ tā ninnu manniṁchi yelide nelĕm̐gāga nā
vaṭṭi vinayamulā valabiṁchevi
suṭṭamai tā vachchidene sulabhamaum̐gāga nā
diṭṭasem̐talā tannum̐ dĕmaliṁchevi

(||anni||)
sannĕrim̐gi tāne nādo sarasa mānuda gāga
kannula mŏkkulā tannugaram̐giṁchevi
nannu nādariṁchi tāne navvide navvĕm̐gāga nā
sannula mŏnalā tannu sādiṁchevi

(||anni||)
gŏnagŏni tāne nannum̐ gūḍidem̐ gūḍĕm̐gāga nā
pĕnam̐gu lāḍalā tannum̐ bĕḍarem̐sevi
yĕnasĕnu śhrī veṁkaḍeśhum̐ḍu tāne nannu
sĕnagulā tannu nem̐ḍu simmirem̐sevi