అన్నిటా జాణఁడు దాను అదెఱఁగఁడా
(॥పల్లవి॥)
అన్నిటా జాణఁడు దాను అదెఱఁగఁడా
కన్నెపాయపు మదము కారుకొనె ననరే
(॥అన్ని॥)
చెలులచే నేనింకాఁ జెప్పిపంపవలెనా
తలఁపులోపలిమాట తా నెఱఁగఁడా
చెలప చెమట నిండె చెక్కులునుఁబులకించె
కొలఁదిలేని వలపు గుబ్బతిల్లీ ననరే
(॥అన్ని॥)
జిగిఁ గడితాన వ్రాసి చేతి కియ్యవెలనా
తగఁ జేసేపనులెల్లా తా నెఱఁగఁడా
నిగిడె నివ్వెరగులు నిట్టూర్పు లివె రేఁగె
చిగిరింపుఁదమకము చిమ్మిరేఁచీ ననరే
(॥అన్ని॥)
యితవైనరతులెల్లా యెచ్చరించవలెనా
తతి నాప్రియములెల్లా తా నెఱఁగఁడా
సతమాయఁ గూటము లిచ్చటఁదా శ్రీవేంకటేశుఁ
డతి సంతోషము నాకు నలవడె ననరే
(||pallavi||)
anniḍā jāṇam̐ḍu dānu adĕṟam̐gam̐ḍā
kannĕbāyabu madamu kārugŏnĕ nanare
(||anni||)
sĕlulase neniṁkām̐ jĕppibaṁpavalĕnā
talam̐pulobalimāḍa tā nĕṟam̐gam̐ḍā
sĕlaba sĕmaḍa niṁḍĕ sĕkkulunum̐bulagiṁchĕ
kŏlam̐dileni valabu gubbadillī nanare
(||anni||)
jigim̐ gaḍidāna vrāsi sedi kiyyavĕlanā
tagam̐ jesebanulĕllā tā nĕṟam̐gam̐ḍā
nigiḍĕ nivvĕragulu niṭṭūrbu livĕ rem̐gĕ
sigiriṁpum̐damagamu simmirem̐sī nanare
(||anni||)
yidavainaradulĕllā yĕchchariṁchavalĕnā
tadi nāpriyamulĕllā tā nĕṟam̐gam̐ḍā
sadamāyam̐ gūḍamu lichchaḍam̐dā śhrīveṁkaḍeśhum̐
ḍadi saṁtoṣhamu nāgu nalavaḍĕ nanare