అన్నిటా జాణఁడు అలమేలుమంగపతి
(॥పల్లవి॥)
అన్నిటా జాణఁడు అలమేలుమంగపతి
పన్ని నీకు మేలువాడైఁ పరగివున్నాఁడు
(॥అన్ని॥)
పట్టినదే పంతమా పతితోడ నీ కిప్పుడు
యిట్టె నిన్ను వేఁడుకోఁగా నియ్యకోరాదా
వొట్టి యప్పటనుండి నీవొడి వట్టుకొన్నవాఁడు
గట్టువాయ తనమేల కరఁగనే మనసు
(॥అన్ని॥)
చలములే సాదింతురా సారె సారె నాతనితో
బలిమిఁ బిలువఁగాను పలుకరాదా
కలపుకోలు సేసుక కాఁగిలించుకున్నవాఁడు
పెలుచుఁదనములేల పెనఁగవే రతిని
(॥అన్ని॥)
చేరి ఇట్టె బిగుతురా శ్రీ వేంకటేశ్వరునితో
మేరతో నిన్నేలఁగాను మెచ్చఁగరాదా
యీరీతి నిన్నుఁ బెండ్లాడె యెడయక వున్నవాఁడు
వీరిడితనములేల వెలయవే మరిగి
(||pallavi||)
anniḍā jāṇam̐ḍu alamelumaṁgabadi
panni nīgu meluvāḍaim̐ paragivunnām̐ḍu
(||anni||)
paṭṭinade paṁtamā padidoḍa nī kippuḍu
yiṭṭĕ ninnu vem̐ḍugom̐gā niyyagorādā
vŏṭṭi yappaḍanuṁḍi nīvŏḍi vaṭṭugŏnnavām̐ḍu
gaṭṭuvāya tanamela karam̐gane manasu
(||anni||)
salamule sādiṁturā sārĕ sārĕ nādanido
balimim̐ biluvam̐gānu palugarādā
kalabugolu sesuga kām̐giliṁchugunnavām̐ḍu
pĕlusum̐danamulela pĕnam̐gave radini
(||anni||)
seri iṭṭĕ bigudurā śhrī veṁkaḍeśhvarunido
merado ninnelam̐gānu mĕchcham̐garādā
yīrīdi ninnum̐ bĕṁḍlāḍĕ yĕḍayaga vunnavām̐ḍu
vīriḍidanamulela vĕlayave marigi