అన్నిటా జాణ గదవే అవుభళనారసింహుఁడు
(॥పల్లవి॥)
అన్నిటా జాణ గదవే అవుభళనారసింహుఁడు
కన్నెలాటలు చూపఁగా గతలడిగీని
(॥॥)
బంతినే నవ్వులు నవ్వీ బ్రహ్లదవరదుఁడు
చెంతనే సేవలు సేసే చెంచెతలతో
కాంతుల వారి చన్నులు కానుకలు చూపఁగాను
అంతలోఁ బారిటాకు పయ్యదలఁ గప్పుమని
(॥॥)
అయములెల్లా నంటె నహోబలేశుఁడు
పాయవుటింతులు తన పాదాలొత్తఁగా
అయెడఁ గనుచూపుల యమ్ములు గానుకియ్యఁగ
చాయగాఁ బచ్చిపునుఁగు చల్లుకొమ్మనీని
(॥॥)
సిగ్గులు దేరఁగఁ గూడి శ్రీసతినాయకుఁడు
వొగ్గుచుఁ గొమరెలెల్లా నొడివట్టఁగా
కగ్గక మోవిపండ్లు కానుకియ్యఁగా కూటము
లగ్గువాయ శ్రీవేంకటమందు రమ్మనీని
(||pallavi||)
anniḍā jāṇa gadave avubhaḽanārasiṁhum̐ḍu
kannĕlāḍalu sūbam̐gā gadalaḍigīni
(||||)
baṁtine navvulu navvī brahladavaradum̐ḍu
sĕṁtane sevalu sese sĕṁchĕdalado
kāṁtula vāri sannulu kānugalu sūbam̐gānu
aṁtalom̐ bāriḍāgu payyadalam̐ gappumani
(||||)
ayamulĕllā naṁṭĕ nahobaleśhum̐ḍu
pāyavuḍiṁtulu tana pādālŏttam̐gā
ayĕḍam̐ ganusūbula yammulu gānugiyyam̐ga
sāyagām̐ bachchibunum̐gu sallugŏmmanīni
(||||)
siggulu deram̐gam̐ gūḍi śhrīsadināyagum̐ḍu
vŏggusum̐ gŏmarĕlĕllā nŏḍivaṭṭam̐gā
kaggaga movibaṁḍlu kānugiyyam̐gā kūḍamu
lagguvāya śhrīveṁkaḍamaṁdu rammanīni