Annidaa guttudo numdudadimelu

అన్నిటా గుట్టుతో నుండుటదిమేలు
Language

(॥పల్లవి॥)
అన్నిటా గుట్టుతో నుండుటదిమేలు
తన్నుఁదానె వచ్చి యేల తడవేవు మమ్మును

(॥అన్ని॥)
మనసురాని సతి మాఁటలెన్ని యాడినాను
వొనరివుండరు కడువగరై తోఁచు
కొనవేసి మరొకొంత కొసరఁగ బోతేను
పెనపరాలకు వచ్చి పిప్పిగట్టును

(॥అన్ని॥)
యెరపరికపుచెలి యెంత నవ్వు నవ్వినాను
సరవితోనుండదు చప్పనై తోఁచు
పొరలించి మరికొంత పూఁచి కానుక వెట్టితే
కరఁగక లోలోనే గరివడును

(॥అన్ని॥)
నెమ్మిఁ దరితీపులేని నెలఁత యెంత మొక్కినా
వొమ్మ సమ్మతమై వుండదు వుప్పనై తోఁచు
కమ్మి శ్రీవేంకటేశ నేఁ గలసితి నింకెట్టన్నా
చెమ్మవుట్టి వలపులు చిగిరించును

(||pallavi||)
anniḍā guṭṭudo nuṁḍuḍadimelu
tannum̐dānĕ vachchi yela taḍavevu mammunu

(||anni||)
manasurāni sadi mām̐ṭalĕnni yāḍinānu
vŏnarivuṁḍaru kaḍuvagarai tom̐su
kŏnavesi marŏgŏṁta kŏsaram̐ga bodenu
pĕnabarālagu vachchi pippigaṭṭunu

(||anni||)
yĕrabarigabusĕli yĕṁta navvu navvinānu
saravidonuṁḍadu sappanai tom̐su
pŏraliṁchi marigŏṁta pūm̐si kānuga vĕṭṭide
karam̐gaga lolone garivaḍunu

(||anni||)
nĕmmim̐ daridībuleni nĕlam̐ta yĕṁta mŏkkinā
vŏmma sammadamai vuṁḍadu vuppanai tom̐su
kammi śhrīveṁkaḍeśha nem̐ galasidi niṁkĕṭṭannā
sĕmmavuṭṭi valabulu sigiriṁchunu