అన్నిటా ఘనుఁడు దాను అందు కేఁటిదే
(॥పల్లవి॥)
అన్నిటా ఘనుఁడు దాను అందు కేఁటిదే
వున్నట్టె చెప్పఁ గదరే వూరకుండ నేలా
(॥అన్నిటా॥)
చెలులఁ దా నంపివాఁడు చెంతనే రాకుండ గాఁను
అలిగి వుందానఁ దొల్లె అందు కేఁటిదే
కలఁగి ముంగోపమున కానివొట్టు వెట్టుకొంటి
పిలిపించ రాదు నాకు పిన్నదాన నేను
(॥అన్నిటా॥)
ముంచి లేక లంపినాఁడు మొక్కితి నే నన్నాఁడు
యెంచితే నెంతయినఁ గద్దు యే మందునే
పంచుక యిందరిలోనఁ బంత మెల్ల నాడుకొంటి
అంచల నాకు రారాదు ఆఁటదాన నేను
(॥అన్నిటా॥)
సంగడిఁ గూచున్నాఁడు చన వెల్ల నిచ్చినాఁడు
యెంగిలిమో వడిగీని యే మందునే
సంగతై శ్రీవెంకటేశ్వరుఁ డిట్టె నన్నుఁ గూడె
చెంగట మెచ్చఁగ రాదు సిగ్గుతోడి నేను
(||pallavi||)
anniḍā ghanum̐ḍu dānu aṁdu kem̐ṭide
vunnaṭṭĕ sĕppam̐ gadare vūraguṁḍa nelā
(||anniḍā||)
sĕlulam̐ dā naṁpivām̐ḍu sĕṁtane rāguṁḍa gām̐nu
aligi vuṁdānam̐ dŏllĕ aṁdu kem̐ṭide
kalam̐gi muṁgobamuna kānivŏṭṭu vĕṭṭugŏṁṭi
pilibiṁcha rādu nāgu pinnadāna nenu
(||anniḍā||)
muṁchi lega laṁpinām̐ḍu mŏkkidi ne nannām̐ḍu
yĕṁchide nĕṁtayinam̐ gaddu ye maṁdune
paṁchuga yiṁdarilonam̐ baṁta mĕlla nāḍugŏṁṭi
aṁchala nāgu rārādu ām̐ṭadāna nenu
(||anniḍā||)
saṁgaḍim̐ gūsunnām̐ḍu sana vĕlla nichchinām̐ḍu
yĕṁgilimo vaḍigīni ye maṁdune
saṁgadai śhrīvĕṁkaḍeśhvarum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
sĕṁgaḍa mĕchcham̐ga rādu siggudoḍi nenu