Annidaa doddavaamdavu ananemi vunnadimka

అన్నిటా దొడ్డవాఁడవు అననేమి వున్నదిఁక
Language

(॥పల్లవి॥)
అన్నిటా దొడ్డవాఁడవు అననేమి వున్నదిఁక
వున్నతి నెందరి నిఁక మన్నించ నున్నాఁడవో

(॥అన్ని॥)
బడిబడి చెప్పఁగానే పండ్లు వులిసీ నిదే
కడు నీసుద్దులు చింతకాయ వంటివి
జడియక యెప్పుడూ నీ సంగడిఁ గూచుండితేను
యెడయక ఇఁక మరి యెంత నోరూరించునో

(॥అన్ని॥)
సోమరించి యేపాటి సోకిఁనాఁ గాఁకలు రేఁగీ
ప్రేమ నీచేఁతలు ఆవపిండివంటిది
దోమటి నీ కంచము దొడికితే వలపలు
తామెర దంపరలై తల కెంత యెక్కునో

(॥అన్ని॥)
సొగిసి శ్రీ వేంకటేశ చూచితేనే ఆ వుట్టీ
తగునీనవ్వులు పంచదారవంటివి
అగడుగఁ గూడితివి అలమేలుమంగ నేను
జగతి నీ మోవితేనె చవెంత వుట్టించునో

(||pallavi||)
anniḍā dŏḍḍavām̐ḍavu ananemi vunnadim̐ka
vunnadi nĕṁdari nim̐ka manniṁcha nunnām̐ḍavo

(||anni||)
baḍibaḍi sĕppam̐gāne paṁḍlu vulisī nide
kaḍu nīsuddulu siṁtagāya vaṁṭivi
jaḍiyaga yĕppuḍū nī saṁgaḍim̐ gūsuṁḍidenu
yĕḍayaga im̐ka mari yĕṁta norūriṁchuno

(||anni||)
somariṁchi yebāḍi sogim̐nām̐ gām̐kalu rem̐gī
prema nīsem̐talu āvabiṁḍivaṁṭidi
domaḍi nī kaṁchamu dŏḍigide valabalu
tāmĕra daṁparalai tala kĕṁta yĕkkuno

(||anni||)
sŏgisi śhrī veṁkaḍeśha sūsidene ā vuṭṭī
tagunīnavvulu paṁchadāravaṁṭivi
agaḍugam̐ gūḍidivi alamelumaṁga nenu
jagadi nī movidenĕ savĕṁta vuṭṭiṁchuno