Annidaa bhaagyavamtumda vavuduvayyaa

అన్నిటా భాగ్యవంతుఁడ వవుదువయ్యా
Language

(॥పల్లవి॥)
అన్నిటా భాగ్యవంతుఁడ వవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకు నిపుడు

(॥అన్ని॥)
పడఁతి మోహరసము పన్నీటిమజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుదకన్నుచూపులు నించినతట్టుపునుఁగు
తొడిఁబడ సులభాన దొరకె నీకిపుడు

(॥అన్ని॥)
కామినికెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటిమాటలవిందు ధూపదీపనైవేద్యాలు
కామించినటువలెనె కలిగె నీకిపుడు

(॥అన్ని॥)
అలమేలుమంగనవ్వులంగవు పువ్వుదండలు
కలసి వురాన నీకే కట్టినతాళి
చలపట్టి యీకెరతి సకలసంపదలు
యిలనబ్బె శ్రీ వేంకటేశ నీకు నిపుడు

(||pallavi||)
anniḍā bhāgyavaṁtum̐ḍa vavuduvayyā
panninaṁdugallā vachchu bhāma nīgu nibuḍu

(||anni||)
paḍam̐ti moharasamu pannīḍimajjanamu
kaḍaleni yābĕsiggu kappuragābu
niḍudagannusūbulu niṁchinadaṭṭubunum̐gu
tŏḍim̐baḍa sulabhāna dŏragĕ nīgibuḍu

(||anni||)
kāminigĕmmovigāṁti kaṭṭugŏne saṁdragāvi
āmugŏnna mohagaḽalābharaṇālu
domaḍimāḍalaviṁdu dhūbadībanaivedyālu
kāmiṁchinaḍuvalĕnĕ kaligĕ nīgibuḍu

(||anni||)
alamelumaṁganavvulaṁgavu puvvudaṁḍalu
kalasi vurāna nīge kaṭṭinadāḽi
salabaṭṭi yīgĕradi sagalasaṁpadalu
yilanabbĕ śhrī veṁkaḍeśha nīgu nibuḍu