Annidaa bhaagyavamtumda vauduvayyaa

అన్నిటా భాగ్యవంతుఁడ వౌదువయ్యా
Language

(॥పల్లవి॥)
అన్నిటా భాగ్యవంతుఁడ వౌదువయ్యా
కన్నులెదిటి నిధులు కాంతలు నీ కెప్పుడు

(॥అన్ని॥)
సందడిఁ బాదము దొక్కి సరిఁ బెండ్లాడితినంటా
ముందు ముందే చుట్టరికములు చెప్పేవు
యెందరిఁ గైకొంటివో యిటువలెనే తొల్లి
అందుకోలువావు లిట్లు అబ్బె నీకు నిపుడు

(॥అన్ని॥)
చెలఁగి పోచిళ్లు చల్లి సేసలు వెట్టితినంటా
మలసి పెండ్లివిడేలు మాకుఁ బెట్టేవు
ఇల పై నెవ్వరెవ్వరి నిట్లాఁ జేసుకొంటివో
లలిఁ బొరుగు నేస్తాలు లాభించె నిపుడు

(॥అన్ని॥)
మెచ్చి కాఁగిలించుకొని మేనదాననని
కుచ్చి పెండ్లికూఁతురంటా గురి సేసేవు
ఇచ్చట శ్రీ వేంకటేశ ఇది నీకు నలవాటో
చెచ్చెర నీ కోరికలు సిద్ధించె నిపుడు

(||pallavi||)
anniḍā bhāgyavaṁtum̐ḍa vauduvayyā
kannulĕdiḍi nidhulu kāṁtalu nī kĕppuḍu

(||anni||)
saṁdaḍim̐ bādamu dŏkki sarim̐ bĕṁḍlāḍidinaṁṭā
muṁdu muṁde suṭṭarigamulu sĕppevu
yĕṁdarim̐ gaigŏṁṭivo yiḍuvalĕne tŏlli
aṁdugoluvāvu liṭlu abbĕ nīgu nibuḍu

(||anni||)
sĕlam̐gi posiḽlu salli sesalu vĕṭṭidinaṁṭā
malasi pĕṁḍliviḍelu māgum̐ bĕṭṭevu
ila pai nĕvvarĕvvari niṭlām̐ jesugŏṁṭivo
lalim̐ bŏrugu nestālu lābhiṁchĕ nibuḍu

(||anni||)
mĕchchi kām̐giliṁchugŏni menadānanani
kuchchi pĕṁḍligūm̐turaṁṭā guri sesevu
ichchaḍa śhrī veṁkaḍeśha idi nīgu nalavāḍo
sĕchchĕra nī korigalu siddhiṁchĕ nibuḍu