Annidaa bhaagyavamtumda vaudu vayyaa

అన్నిటా భాగ్యవంతుఁడ వౌదు వయ్యా
Language

(॥పల్లవి॥)
అన్నిటా భాగ్యవంతుఁడ వౌదు వయ్యా
సన్నలు సేసీ నిదె చక్కని జవరాలు

(॥అన్ని॥)
మోము చూచి నీ మీఁద మోహము చల్లీ నేఁడు
ప్రేమగలసేసపాల పెండ్లికూఁతురు
చేముట్టి సరసమాడి సేవలెల్లాఁజేయఁజొచ్చె
ఆమని నవ్వులతో మోహపు దేవులు

(॥అన్ని॥)
మల్లాడి యడుగులకు మడుగులు వరచీని
చెల్లుబడిగలిగిన చెలిమికత్తె
వుల్లము గరఁగను నీ బడివట్టి పెనఁగీని
బల్లిదురాలైన నీ పాయరాని చుట్టము

(॥అన్ని॥)
గక్కన నిన్నుఁజూచి కాఁగిటఁ బాయక కూడె
మిక్కిలినేర్పుల యలమేలుమంగ
ఇక్కవతో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
పక్కఁ బాయ దక్కుమీఁది బంగారు పతిమ

(||pallavi||)
anniḍā bhāgyavaṁtum̐ḍa vaudu vayyā
sannalu sesī nidĕ sakkani javarālu

(||anni||)
momu sūsi nī mīm̐da mohamu sallī nem̐ḍu
premagalasesabāla pĕṁḍligūm̐turu
semuṭṭi sarasamāḍi sevalĕllām̐jeyam̐jŏchchĕ
āmani navvulado mohabu devulu

(||anni||)
mallāḍi yaḍugulagu maḍugulu varasīni
sĕllubaḍigaligina sĕlimigattĕ
vullamu garam̐ganu nī baḍivaṭṭi pĕnam̐gīni
ballidurālaina nī pāyarāni suṭṭamu

(||anni||)
gakkana ninnum̐jūsi kām̐giḍam̐ bāyaga kūḍĕ
mikkilinerbula yalamelumaṁga
ikkavado śhrīveṁkaḍeśha nannu nelidivi
pakkam̐ bāya dakkumīm̐di baṁgāru padima