అన్ని తగవులు నీయందే వున్నవి
(॥పల్లవి॥)
అన్ని తగవులు నీయందే వున్నవి
యెన్నిక విచారము లేమిటికి నీకు
(॥అన్ని॥)
మునుపఁ గప్పురమిచ్చి ముదిత గాచుకుండఁగ
వెనక విడెమిచ్చినవెలఁదితో నవ్వేవు
చెనకేయక్కకంటెను చెల్లెలే ప్రియముగాదా
చెనయఁ బెద్దతనము లెవ్వరికి బాఁతి
(॥అన్ని॥)
పంతాన సేవసేసేటిపడఁతి పక్కనుండఁగ
చెంతనే మొక్కులు మొక్కేచెలిపైఁ జేయి చాఁచేవు
పొంతనున్న సతికంటె పొరుగాపె చవిగాదు
యెంతసేసే వినయాలు యెవ్వరికి బాంతి
(॥అన్ని॥)
సరసమాడేయాపె సంగడినే వుండఁగాను
వొరసి పెనఁగేనన్ను నొగిఁ గూడేవు
గొరబై శ్రీవేంకటేశ కొసరునే మేలుగాదా
యెవులపాఁతవల పెవ్వరికి బాఁతి
(||pallavi||)
anni tagavulu nīyaṁde vunnavi
yĕnniga visāramu lemiḍigi nīgu
(||anni||)
munubam̐ gappuramichchi mudida gāsuguṁḍam̐ga
vĕnaga viḍĕmichchinavĕlam̐dido navvevu
sĕnageyakkagaṁṭĕnu sĕllĕle priyamugādā
sĕnayam̐ bĕddadanamu lĕvvarigi bām̐ti
(||anni||)
paṁtāna sevaseseḍibaḍam̐ti pakkanuṁḍam̐ga
sĕṁtane mŏkkulu mŏkkesĕlibaim̐ jeyi sām̐sevu
pŏṁtanunna sadigaṁṭĕ pŏrugābĕ savigādu
yĕṁtasese vinayālu yĕvvarigi bāṁti
(||anni||)
sarasamāḍeyābĕ saṁgaḍine vuṁḍam̐gānu
vŏrasi pĕnam̐genannu nŏgim̐ gūḍevu
gŏrabai śhrīveṁkaḍeśha kŏsarune melugādā
yĕvulabām̐tavala pĕvvarigi bām̐ti