అన్ని సింగారాలు నీకు నమరివున్నవి నేఁడు
(॥పల్లవి॥)
అన్ని సింగారాలు నీకు నమరివున్నవి నేఁడు
సన్నల మేరకు మేర సరసమే చాలు
(॥అన్ని॥)
మాటలాడకువయ్య మదనముద్రలు రాగీ
చాటువగా నాకు నీ చేనన్నలే చాలు
గాటపు మై యంటకు గందపు బేఁటులు రాలీ
జూటరిపనేమి గల్లచూపులనే మెలఁగు
(॥అన్ని॥)
లాగుల మొక్కకువయ్య లత్తుక నుదుట మాసీ
ఆగతిఁ జెలియ నయమునలే చాలు
నాగమై బెట్టు నగకు వాడుఁబువ్వు లవే రాలీ
మూగిన మూఁకలలోన మోనమే చాలు
(॥అన్ని॥)
మేను మేను సోఁకకు మించుఁ జెమటలు దేరీ
పూని సంగడి గూచున్న పొందులే చాలు
మానక యెంత చెప్పినా మచ్చిక నన్నుఁ గూడితి
వానుక శ్రీవేంకటేశ అందుకదేచాలు
(||pallavi||)
anni siṁgārālu nīgu namarivunnavi nem̐ḍu
sannala meragu mera sarasame sālu
(||anni||)
māḍalāḍaguvayya madanamudralu rāgī
sāḍuvagā nāgu nī senannale sālu
gāḍabu mai yaṁṭagu gaṁdabu bem̐ṭulu rālī
jūḍaribanemi gallasūbulane mĕlam̐gu
(||anni||)
lāgula mŏkkaguvayya lattuga nuduḍa māsī
āgadim̐ jĕliya nayamunale sālu
nāgamai bĕṭṭu nagagu vāḍum̐buvvu lave rālī
mūgina mūm̐kalalona moname sālu
(||anni||)
menu menu som̐kagu miṁchum̐ jĕmaḍalu derī
pūni saṁgaḍi gūsunna pŏṁdule sālu
mānaga yĕṁta sĕppinā machchiga nannum̐ gūḍidi
vānuga śhrīveṁkaḍeśha aṁdugadesālu