అన్ని సింగారాలు నీకె అమరుఁగాక
(॥పల్లవి॥)
అన్ని సింగారాలు నీకె అమరుఁగాక
యన్నిటా దేవతలు నిన్నిందుకే మెచ్చేరు
(॥అన్ని॥)
చందురునివంటిమోము జలజాలే కన్నులట
యిందిర నీకే తగు నీ కొత్తలు
గొంది నొకటొకటికిఁ గూడవందు రివి నీకు
పొందై పాలవెల్లి తోడఁబుట్లే కావా
(॥అన్ని॥)
ముక్కు సంపెంగవంటిది ముంగురులు తేంట్లట
ఇక్కువలు నీకే తగు నీ కొత్తలు
అక్కున వరలక్ష్మివి హరి వసంతమాధవుఁ
డెక్కడా మీ కిద్దరికి యెనయికే కాదా
(॥అన్ని॥)
ధర నడుము సింహము తగు గజగమనాలు
తిరమై శ్రీ వేంకటేశుదేవు నీకే పో
నరసింహుఁడై యుండి కరిఁగాటినట్టివాని-
సురత మందితిగాన చుట్టమువేకొవా
(||pallavi||)
anni siṁgārālu nīgĕ amarum̐gāga
yanniḍā devadalu ninniṁduge mĕchcheru
(||anni||)
saṁdurunivaṁṭimomu jalajāle kannulaḍa
yiṁdira nīge tagu nī kŏttalu
gŏṁdi nŏgaḍŏgaḍigim̐ gūḍavaṁdu rivi nīgu
pŏṁdai pālavĕlli toḍam̐buṭle kāvā
(||anni||)
mukku saṁpĕṁgavaṁṭidi muṁgurulu teṁṭlaḍa
ikkuvalu nīge tagu nī kŏttalu
akkuna varalakṣhmivi hari vasaṁtamādhavum̐
ḍĕkkaḍā mī kiddarigi yĕnayige kādā
(||anni||)
dhara naḍumu siṁhamu tagu gajagamanālu
tiramai śhrī veṁkaḍeśhudevu nīge po
narasiṁhum̐ḍai yuṁḍi karim̐gāḍinaṭṭivāni-
surada maṁdidigāna suṭṭamuvegŏvā