అన్ని సేవలునుఁ జేసీ అంగన నీకు
(॥పల్లవి॥)
అన్ని సేవలునుఁ జేసీ అంగన నీకు
సన్నల నీతో నట్టె సరసమాడీని
(॥॥)
కామించి సిగ్గులతోడ కంకణాలు గదలఁగ
వేమారుఁ బాదము లొత్తీ వెలఁది
ఆమనివలపుతోడ నంగమెల్లాఁ జెమరించ
గోమున నప్పటి నీకుఁ గొప్పువెట్టీని
(॥॥)
సెలవినవ్వులతోడ చెక్కిన పయ్యద జార
మలయుచు వీడెమిచ్చీ మగువ
పులకచెక్కులతోడ పొందులు తలఁపు రాఁగ
వెలయ సురటి నీకు విసరీని
(॥॥)
నిట్టూరుపులతోడ నిండునివ్వెరగుతోడ
గుట్టున గుబ్బల నొత్తీఁ గోమలి
యిట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
జట్టిగొని యాపె యింకా చవులు చూపీని
(||pallavi||)
anni sevalunum̐ jesī aṁgana nīgu
sannala nīdo naṭṭĕ sarasamāḍīni
(||||)
kāmiṁchi sigguladoḍa kaṁkaṇālu gadalam̐ga
vemārum̐ bādamu lŏttī vĕlam̐di
āmanivalabudoḍa naṁgamĕllām̐ jĕmariṁcha
gomuna nappaḍi nīgum̐ gŏppuvĕṭṭīni
(||||)
sĕlavinavvuladoḍa sĕkkina payyada jāra
malayusu vīḍĕmichchī maguva
pulagasĕkkuladoḍa pŏṁdulu talam̐pu rām̐ga
vĕlaya suraḍi nīgu visarīni
(||||)
niṭṭūrubuladoḍa niṁḍunivvĕragudoḍa
guṭṭuna gubbala nŏttīm̐ gomali
yiṭṭĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
jaṭṭigŏni yābĕ yiṁkā savulu sūbīni