Anni panulunu tolli ayinavi neegu

అన్ని పనులును తొల్లి అయినవి నీకు
Language

(॥పల్లవి॥)
అన్ని పనులును తొల్లి అయినవి నీకు
సన్నలఁ దిరిగి నేమే సటలు సేసితిమి

(॥అన్ని॥)
మోము చూచి నవ్వె నాపె ముచ్చట నీతో నాడె
భామని యెవ్వరితోడిపాంగె మేల
చేముట్టి యితరు లిఁకఁ జేనకితే చవులౌనా
కామించి వచ్చిన మాదే కల్ల గాక

(॥అన్ని॥)
వొఱపు గలాపె నిన్ను నొరసెఁ జన్నుల నిట్టె
యెఱఁగనివారిపొందు లేల నీకు
గుఱిగా నిన్నుఁబట్టితే కూళతన మిఁక రాదా
మఱచి నీతో నింతేసిమాటాడితిఁ గాక

(॥అన్ని॥)
పంతమే నెరపె నాపె పనులెల్లఁ జేసె నేఁడు
యింతకంటె నున్నదా యెవ్వరిమేలు
చెంతల శ్రీవేంకటేశ చేకొని కూడితి నన్ను
అంతలో వేగిరించితి నతిగాదు గాక

(||pallavi||)
anni panulunu tŏlli ayinavi nīgu
sannalam̐ dirigi neme saḍalu sesidimi

(||anni||)
momu sūsi navvĕ nābĕ muchchaḍa nīdo nāḍĕ
bhāmani yĕvvaridoḍibāṁgĕ mela
semuṭṭi yidaru lim̐kam̐ jenagide savulaunā
kāmiṁchi vachchina māde kalla gāga

(||anni||)
vŏṟabu galābĕ ninnu nŏrasĕm̐ jannula niṭṭĕ
yĕṟam̐ganivāribŏṁdu lela nīgu
guṟigā ninnum̐baṭṭide kūḽadana mim̐ka rādā
maṟasi nīdo niṁtesimāḍāḍidim̐ gāga

(||anni||)
paṁtame nĕrabĕ nābĕ panulĕllam̐ jesĕ nem̐ḍu
yiṁtagaṁṭĕ nunnadā yĕvvarimelu
sĕṁtala śhrīveṁkaḍeśha segŏni kūḍidi nannu
aṁtalo vegiriṁchidi nadigādu gāga