అన్ని పనులు మీకే అమరుఁగాక । నేము
(॥పల్లవి॥)
అన్ని పనులు మీకే అమరుఁగాక । నేము
కన్నుల నన్నియుఁ గనుగొంటిమిగాక
(॥అన్ని॥)
మీరే తెలియవలె మీలోనిజగడాలు
మారుఁ డెఱఁగవలె మరి మీఁదను
వూరకే మీమాఁట లూఁకొనేచెలులము
కోరి సాకిరి చెప్పఁగూడునా మాకు
(॥అన్ని॥)
చనవు లియ్యఁగవలె చలములు మానవలె
మనసు లెనయవలె మరి మీఁదను
యెనయఁగలిగినట్టియిద్దరి మిమ్ముఁ జూచి
కనుసన్నఁ గోపించఁగలమా నేము
(॥అన్ని॥)
శ్రీవేంకటేశ నీచిత్త మియ్యఁగ -
నీవనితాఁ గూడె నిటు నిన్నును
పూవుఁబరిమళపు పొందులమీలోని-
భావాలు మాకెల్లఁ బలుకఁగవసమా
(||pallavi||)
anni panulu mīge amarum̐gāga | nemu
kannula nanniyum̐ ganugŏṁṭimigāga
(||anni||)
mīre tĕliyavalĕ mīlonijagaḍālu
mārum̐ ḍĕṟam̐gavalĕ mari mīm̐danu
vūrage mīmām̐ṭa lūm̐kŏnesĕlulamu
kori sāgiri sĕppam̐gūḍunā māgu
(||anni||)
sanavu liyyam̐gavalĕ salamulu mānavalĕ
manasu lĕnayavalĕ mari mīm̐danu
yĕnayam̐galiginaṭṭiyiddari mimmum̐ jūsi
kanusannam̐ gobiṁcham̐galamā nemu
(||anni||)
śhrīveṁkaḍeśha nīsitta miyyam̐ga -
nīvanidām̐ gūḍĕ niḍu ninnunu
pūvum̐barimaḽabu pŏṁdulamīloni-
bhāvālu māgĕllam̐ balugam̐gavasamā