Anni nerisinavaamda vaameemdu neravaa

అన్ని నేరిచినవాఁడ వామీఁదు నేరవా
Language

(॥పల్లవి॥)
అన్ని నేరిచినవాఁడ వామీఁదు నేరవా
సన్న సేసినవాఁడవు చాయకు రా నేరావా

(॥అన్ని॥)
కాయ మంటినవాఁడవు కప్పురము నోటి కిచ్చి
ఆయములు గరఁగించ నంత నేరవా
సోయగపుచూపులఁ జూచినవాఁడవు నీవు
పాయపుకోరికె లిచ్చి పచరించ నేరవా

(॥అన్ని॥)
నగినవాఁడవు నీవు నానారీతుల నాతో
అగపడి సరసము లాడ నేరవా
మిగుల నాచేఁతలతో మించినవాఁడవు యిట్టె
బిగువుఁగాఁగిటఁ గడు ప్రేమ రేఁచ నేరవా

(॥అన్ని॥)
మెచ్చినట్టివాఁడవు మేకులు సేసి నేసి
యిచ్చగించి కలయఁగ నింత నేరవా
కుచ్చి శ్రీవెంకటేశుఁడ కూడి మన్నించితి విదె
నిచ్చలు నీమేలు నాపై నెరపఁగ నేవరా

(||pallavi||)
anni nerisinavām̐ḍa vāmīm̐du neravā
sanna sesinavām̐ḍavu sāyagu rā nerāvā

(||anni||)
kāya maṁṭinavām̐ḍavu kappuramu noḍi kichchi
āyamulu garam̐giṁcha naṁta neravā
soyagabusūbulam̐ jūsinavām̐ḍavu nīvu
pāyabugorigĕ lichchi pasariṁcha neravā

(||anni||)
naginavām̐ḍavu nīvu nānārīdula nādo
agabaḍi sarasamu lāḍa neravā
migula nāsem̐talado miṁchinavām̐ḍavu yiṭṭĕ
biguvum̐gām̐giḍam̐ gaḍu prema rem̐sa neravā

(||anni||)
mĕchchinaṭṭivām̐ḍavu megulu sesi nesi
yichchagiṁchi kalayam̐ga niṁta neravā
kuchchi śhrīvĕṁkaḍeśhum̐ḍa kūḍi manniṁchidi vidĕ
nichchalu nīmelu nābai nĕrabam̐ga nevarā