Anni neeve telugo adameemdi panulu

అన్ని నీవే తెలుకో అటమీఁది పనులు
Language

(॥పల్లవి॥)
అన్ని నీవే తెలుకో అటమీఁది పనులు
కన్నులనే నిన్ను మెచ్చి కాచుకుండే నేను

(॥అన్ని॥)
పంతాలు నీతోఁ జెప్పి పలుమారు కొసరఁగ
యెంతటి రట్టడియని యేమందువో
మంతనాన నీరూపు మనసునఁదలచుక
చింతదీర నూరకుండి చేత మొక్కేను

(॥అన్ని॥)
ఆయములు నన్ను నంటి అంకెలకుఁ దియ్యఁగాను
యీయెడ నిల్లాలి కింత యేలందువో
చేయార నీసేవ చేసి చేరి నీపానుపువద్ద
తోయరానిసిగ్గుతో నెదురుచూచే నేను

(॥అన్ని॥)
నీవు గాఁగిలించుకోఁగా నిఱ్ఱనీలిగి వుంటేను
యీవనిత గర్వియని యేమందువో
శ్రీ వేంకటేశ నీచేతికిలోనై కూడితి
భావించి యేపొద్దు నిట్టె పాయకుండే నేను

(||pallavi||)
anni nīve tĕlugo aḍamīm̐di panulu
kannulane ninnu mĕchchi kāsuguṁḍe nenu

(||anni||)
paṁtālu nīdom̐ jĕppi palumāru kŏsaram̐ga
yĕṁtaḍi raṭṭaḍiyani yemaṁduvo
maṁtanāna nīrūbu manasunam̐dalasuga
siṁtadīra nūraguṁḍi seda mŏkkenu

(||anni||)
āyamulu nannu naṁṭi aṁkĕlagum̐ diyyam̐gānu
yīyĕḍa nillāli kiṁta yelaṁduvo
seyāra nīseva sesi seri nībānubuvadda
toyarānisiggudo nĕdurusūse nenu

(||anni||)
nīvu gām̐giliṁchugom̐gā niṭranīligi vuṁṭenu
yīvanida garviyani yemaṁduvo
śhrī veṁkaḍeśha nīsedigilonai kūḍidi
bhāviṁchi yebŏddu niṭṭĕ pāyaguṁḍe nenu