Anni jaadulu daaneyai vunnadi

అన్ని జాతులు దానెయై వున్నది
Language

(॥పల్లవి॥)
అన్ని జాతులు దానెయై వున్నది
కన్నులకలికి మాయగరచెనో యనఁగ

(॥అన్ని॥)
కన్నె శంకిణిజాతి గాఁబోలు వీఁపునను
సన్నపు మదనాంకములు జడి గొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములో యనఁగా

(॥అన్ని॥)
తెఱవ దలపోయ చిత్తిణిజాతి గాఁబోలు
నెఱులు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఱతనము మరుఁడు తను నిండవేసిన యంప-
గరులిన్ని యనుచు లెక్కలు వెట్టుగతిని

(॥అన్ని॥)
కాంత హస్తిణిజాతి గాఁబోలు కరమూలము-
లంతకంతకు నలుపులై యున్నవి
పంతంపుమరుఁడు తన భండారమిండ్లకును
దొంతిగా నిడిన కస్తూరి ముద్రలనఁగా

(॥అన్ని॥)
ఘనత పద్మిణిజాతి గాఁబోలు నీలలన
తనువెల్ల పద్మగంధంబైనది
మినుకుగా మరుఁడు తామెరలమ్ములనె మేను
కనలించి వడిఁ బువ్వుగట్టెనో యనఁగా

(॥అన్ని॥)
ఇదియు జగదేక మోహిణి దానె కాఁబోలు
కదలు కనుఁగవకెంపు గలిగున్నది
వదలకిటు వేంకటేశ్వరుని కుంకుమపూఁత
చెదరి చెలికనుఁగొనలఁ జిందెనోయనఁగా

(||pallavi||)
anni jādulu dānĕyai vunnadi
kannulagaligi māyagarasĕno yanam̐ga

(||anni||)
kannĕ śhaṁkiṇijādi gām̐bolu vīm̐punanu
sannabu madanāṁkamulu jaḍi gŏnnavi
vannĕluga valarāju valabu talagĕkkiṁcha
panninaḍuvaṁṭi sobānamulo yanam̐gā

(||anni||)
tĕṟava dalaboya sittiṇijādi gām̐bolu
nĕṟulu vichchusu vīdhi nilusunnadi
nĕṟadanamu marum̐ḍu tanu niṁḍavesina yaṁpa-
garulinni yanusu lĕkkalu vĕṭṭugadini

(||anni||)
kāṁta hastiṇijādi gām̐bolu karamūlamu-
laṁtagaṁtagu nalubulai yunnavi
paṁtaṁpumarum̐ḍu tana bhaṁḍāramiṁḍlagunu
dŏṁtigā niḍina kastūri mudralanam̐gā

(||anni||)
ghanada padmiṇijādi gām̐bolu nīlalana
tanuvĕlla padmagaṁdhaṁbainadi
minugugā marum̐ḍu tāmĕralammulanĕ menu
kanaliṁchi vaḍim̐ buvvugaṭṭĕno yanam̐gā

(||anni||)
idiyu jagadega mohiṇi dānĕ kām̐bolu
kadalu kanum̐gavagĕṁpu galigunnadi
vadalagiḍu veṁkaḍeśhvaruni kuṁkumabūm̐ta
sĕdari sĕliganum̐gŏnalam̐ jiṁdĕnoyanam̐gā