అన్ని గుణాలను నీవే అధికుఁడవు
(॥పల్లవి॥)
అన్ని గుణాలను నీవే అధికుఁడవు
కన్నె నిన్నుఁ బొగడుతా కడు సంతోసించెను
(॥అన్ని॥)
మొగమోటగలవాఁడు మోనాన నూరకుండు
తగవెరిఁగినవాఁడు దయదలఁచు
నగవెరిఁగినవాఁడు నంటునను సమ్మతించు
తగులమిగులవాఁడు దండఁ బాయకుండును
(॥అన్ని॥)
వలచినవాఁడు కైవసమై మచ్చికసేసు
తలఁపొక్కటైనవాఁడు దాఁటఁడు మాట
నిలుకడైనవాఁడు నెట్టుకొని పొందుసేసు
పలుకనేర్చినవాఁడు పచరించుఁ గూరిమి
(॥అన్ని॥)
సన్నయెరిఁగినవాఁడు సరసుఁడై మెలఁగును
మన్నించనోపినవాండు మర్మములంటు
ఇన్నిటా శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
పన్నికూడితివి నీపంతము లీడేరెను
(||pallavi||)
anni guṇālanu nīve adhigum̐ḍavu
kannĕ ninnum̐ bŏgaḍudā kaḍu saṁtosiṁchĕnu
(||anni||)
mŏgamoḍagalavām̐ḍu monāna nūraguṁḍu
tagavĕrim̐ginavām̐ḍu dayadalam̐su
nagavĕrim̐ginavām̐ḍu naṁṭunanu sammadiṁchu
tagulamigulavām̐ḍu daṁḍam̐ bāyaguṁḍunu
(||anni||)
valasinavām̐ḍu kaivasamai machchigasesu
talam̐pŏkkaḍainavām̐ḍu dām̐ṭam̐ḍu māḍa
nilugaḍainavām̐ḍu nĕṭṭugŏni pŏṁdusesu
paluganersinavām̐ḍu pasariṁchum̐ gūrimi
(||anni||)
sannayĕrim̐ginavām̐ḍu sarasum̐ḍai mĕlam̐gunu
manniṁchanobinavāṁḍu marmamulaṁṭu
inniḍā śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
pannigūḍidivi nībaṁtamu līḍerĕnu