అన్ని బిన్నాణాలు నేర్తు వవునే నీవు
(॥పల్లవి॥)
అన్ని బిన్నాణాలు నేర్తు వవునే నీవు
మన్నించిన జాణనికి మరి కోపమున్నదా
(॥అన్ని॥)
వూఁకొనని మాటలకు వుత్తరాలు చెప్పేవు
వీఁకల నాతఁడు నీకు వెఱచునటే
కాఁకల చూపులకేల కప్పురాలు నూరేవే
వాఁకమైన సరసుఁడు వద్దనీనా నిన్ను
(॥అన్ని॥)
మనసులో నవ్వులకు మరి వొడ్డించుకొనేవు
ఘనుఁ డాతనిచిత్తము కంటినటవే
పొనుఁగ నీమోవి నేల బోనాలు వండేవు
తనిసిన ప్రాణేశుఁడు తప్పులు వట్టీనా
(॥అన్ని॥)
కాఁగిటిలో రతులకు గాదెలు గట్టుకొనేవు
ఆఁగి శ్రీ వేంకటేశుఁడు అచ్చునటవే
వీఁగక యీతనిఁ గూడి విందు వెట్టేవు వలపు
చేఁగదేరెను ధీరుఁడు సిగ్గులు వడీనా
(||pallavi||)
anni binnāṇālu nerdu vavune nīvu
manniṁchina jāṇanigi mari kobamunnadā
(||anni||)
vūm̐kŏnani māḍalagu vuttarālu sĕppevu
vīm̐kala nādam̐ḍu nīgu vĕṟasunaḍe
kām̐kala sūbulagela kappurālu nūreve
vām̐kamaina sarasum̐ḍu vaddanīnā ninnu
(||anni||)
manasulo navvulagu mari vŏḍḍiṁchugŏnevu
ghanum̐ ḍādanisittamu kaṁṭinaḍave
pŏnum̐ga nīmovi nela bonālu vaṁḍevu
tanisina prāṇeśhum̐ḍu tappulu vaṭṭīnā
(||anni||)
kām̐giḍilo radulagu gādĕlu gaṭṭugŏnevu
ām̐gi śhrī veṁkaḍeśhum̐ḍu achchunaḍave
vīm̐gaga yīdanim̐ gūḍi viṁdu vĕṭṭevu valabu
sem̐gaderĕnu dhīrum̐ḍu siggulu vaḍīnā