Annee neevallane aabe yimta navvemgaaga

అన్నీ నీవల్లనే ఆపె యింత నవ్వెఁగాక
Language

(॥పల్లవి॥)
అన్నీ నీవల్లనే ఆపె యింత నవ్వెఁగాక
యెన్నటివలెనే వుంటే యెమ్మెలు చూపీనా

(॥అన్నీ॥)
సలిగె గలయాడది చలము సాదించుఁ గాక
బలిమి లేకుండిది పంత మాడీనా
చెలిమి యీడేరితేను సేఁతలెల్లాఁ జెసుఁగాక
వలసినొల్లములై తే వాసికిఁ బెనఁగీనా

(॥అన్ని॥)
మందెమేళ మైనతి మదించి చెనకుఁగాక
కందువ దెలియనిది గరసించీనా
పొందు గడుఁధగు లై తే పొత్తులకు వచ్చుఁగాక
సందడిలో మాటలకు సరుసఁ గూచుండీనా

(॥అన్ని॥)
బాస సేయించుకొన్నా పె పానుపుపైఁ బండుఁగాక
సేస వెట్టనిమగువ చిమ్మ రేఁగీనా
ఆసల శ్రీ వేంకటేశ అలమేలు మంగను నేను
నీతి యైనంతలోనే నీ సాటి వచ్చీనా

(||pallavi||)
annī nīvallane ābĕ yiṁta navvĕm̐gāga
yĕnnaḍivalĕne vuṁṭe yĕmmĕlu sūbīnā

(||annī||)
saligĕ galayāḍadi salamu sādiṁchum̐ gāga
balimi leguṁḍidi paṁta māḍīnā
sĕlimi yīḍeridenu sem̐talĕllām̐ jĕsum̐gāga
valasinŏllamulai te vāsigim̐ bĕnam̐gīnā

(||anni||)
maṁdĕmeḽa mainadi madiṁchi sĕnagum̐gāga
kaṁduva dĕliyanidi garasiṁchīnā
pŏṁdu gaḍum̐dhagu lai te pŏttulagu vachchum̐gāga
saṁdaḍilo māḍalagu sarusam̐ gūsuṁḍīnā

(||anni||)
bāsa seyiṁchugŏnnā pĕ pānububaim̐ baṁḍum̐gāga
sesa vĕṭṭanimaguva simma rem̐gīnā
āsala śhrī veṁkaḍeśha alamelu maṁganu nenu
nīdi yainaṁtalone nī sāḍi vachchīnā