Annee mechchayyeeni amdugeme

అన్నీ మెచ్చయ్యీని అందుకేమే
Language

(॥పల్లవి॥)
అన్నీ మెచ్చయ్యీని అందుకేమే
నిన్నటి సుద్దులు నే నెఱఁగనా

(॥అన్నీ॥)
చలమునెరపేసాదవే నీవు
చెలులతో నేమి చెప్పేవే
ములుచతనపుముద్దరాలవే
నెలఁతరో నిన్ను నే నెఱఁగనా

(॥అన్నీ॥)
చక్కనినవ్వులసానరాయివే
మిక్కిలి యేల నమ్మించేవే
చిక్కనసిగ్గులచింతకాయవే
నిక్కపునీసుద్ది నే నెఱఁగనా

(॥అన్నీ॥)
తెగనమాఁటలతేనెవే నీవు
మొగము చూచేల మొక్కేవే
నగి శ్రీవేంకటోన్నతుఁడు నన్నేలె
నిగిడి నీగుట్టు నే నెఱఁగనా

(||pallavi||)
annī mĕchchayyīni aṁdugeme
ninnaḍi suddulu ne nĕṟam̐ganā

(||annī||)
salamunĕrabesādave nīvu
sĕlulado nemi sĕppeve
mulusadanabumuddarālave
nĕlam̐taro ninnu ne nĕṟam̐ganā

(||annī||)
sakkaninavvulasānarāyive
mikkili yela nammiṁcheve
sikkanasiggulasiṁtagāyave
nikkabunīsuddi ne nĕṟam̐ganā

(||annī||)
tĕganamām̐ṭaladenĕve nīvu
mŏgamu sūsela mŏkkeve
nagi śhrīveṁkaḍonnadum̐ḍu nannelĕ
nigiḍi nīguṭṭu ne nĕṟam̐ganā