సాకిరులేల పెట్టేవు సతివల్ల నేరమేది
(॥పల్లవి॥)
సాకిరులేల పెట్టేవు సతివల్ల నేరమేది
కాకుసేయఁ బనిలేదు కరుణించు మికఁను
(॥సాకి॥)
సుదతికిఁ బతితోడ సొలసితే నేమాయ
వుదుట మీరఁగఁ దిట్టనొద్దుగాని
సదరాన బొమ్మలను జంకించితే నేమాయ
యెదుటనుండి యలిగి యేఁపవద్దుగాని
(॥సాకి॥)
కూరిములు సారె సారెఁ గొసరితే నేమాయ
వారించి యానలు వెట్టవద్దుగాని
బీరముతో గొంగువట్టి పెనఁగితే నేమాయ
దారకాన దెరలోన దాఁగవద్దుగాని
(॥సాకి॥)
గుట్టుతోడఁ గాఁగిలించి కూడితే నేమాయ
వట్టి నేరము లెంచఁగవద్దుగాని
యిట్టె శ్రీవేంకటేశ యేలితి వీకెను నీవు
చుట్టమైతే నేమాయ సోదించవద్దుగాని
(||pallavi||)
sāgirulela pĕṭṭevu sadivalla neramedi
kāguseyam̐ baniledu karuṇiṁchu migam̐nu
(||sāgi||)
sudadigim̐ badidoḍa sŏlaside nemāya
vuduḍa mīram̐gam̐ diṭṭanŏddugāni
sadarāna bŏmmalanu jaṁkiṁchide nemāya
yĕduḍanuṁḍi yaligi yem̐pavaddugāni
(||sāgi||)
kūrimulu sārĕ sārĕm̐ gŏsaride nemāya
vāriṁchi yānalu vĕṭṭavaddugāni
bīramudo gŏṁguvaṭṭi pĕnam̐gide nemāya
dāragāna dĕralona dām̐gavaddugāni
(||sāgi||)
guṭṭudoḍam̐ gām̐giliṁchi kūḍide nemāya
vaṭṭi neramu lĕṁcham̐gavaddugāni
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidi vīgĕnu nīvu
suṭṭamaide nemāya sodiṁchavaddugāni