సాగిన సబలలోన సరివారిలోన నెల్లా
(॥పల్లవి॥)
సాగిన సబలలోన సరివారిలోన నెల్లా
యీ గతి మన్నించితివి యీపెదె పో బ్రదుకు
(॥సాగిన॥)
చేయి వట్టి తీసి యింతిఁ జేరఁ బిలుచుకొంటివి
చాయల నిందరూఁ జూడఁ జాలదా యింత
పాయనిమోహ మెఱఁగి పై జేయి వేసి నేఁడు
యీ యెడ మన్నించితివి యీపెదెపో బ్రదుకు
(॥సాగిన॥)
వంచిన చెలిశిరసు వడి నెత్తి పలికించి
చంచలించక నవ్వితి చాలదా యింత
కొంచ కాపెగుణములు కొనియాడి కొలువులో
యెంచి మన్నించితి విట్టె యీపెదెపో బ్రదుకు
(॥సాగిన॥)
చెక్కు నొక్కి నిమ్మపండు చేతి కిచ్చి బుజ్జగించి
చక్కసరస మాడితి చాలదా యింత
దక్కిబి శ్రీవేంకటేశ తరుణి కౌఁగిటనే
యెక్కుడు మన్నించితివి యీపెదెపో బ్రదుకు
(||pallavi||)
sāgina sabalalona sarivārilona nĕllā
yī gadi manniṁchidivi yībĕdĕ po bradugu
(||sāgina||)
seyi vaṭṭi tīsi yiṁtim̐ jeram̐ bilusugŏṁṭivi
sāyala niṁdarūm̐ jūḍam̐ jāladā yiṁta
pāyanimoha mĕṟam̐gi pai jeyi vesi nem̐ḍu
yī yĕḍa manniṁchidivi yībĕdĕbo bradugu
(||sāgina||)
vaṁchina sĕliśhirasu vaḍi nĕtti paligiṁchi
saṁchaliṁchaga navvidi sāladā yiṁta
kŏṁcha kābĕguṇamulu kŏniyāḍi kŏluvulo
yĕṁchi manniṁchidi viṭṭĕ yībĕdĕbo bradugu
(||sāgina||)
sĕkku nŏkki nimmabaṁḍu sedi kichchi bujjagiṁchi
sakkasarasa māḍidi sāladā yiṁta
dakkibi śhrīveṁkaḍeśha taruṇi kaum̐giḍane
yĕkkuḍu manniṁchidivi yībĕdĕbo bradugu