Title (Indic)పాపమంటాఁ బాలిచ్చితేఁ బైపై నోకిలింతలాయ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాపమంటాఁ బాలిచ్చితేఁ బైపై నోకిలింతలాయ కోపము శాంతముతోడఁ గూడెఁగా నీ చనవు (॥॥) నిండినది నామనసు నీమేఁద నేపొద్దు పండెను నాకెమ్మోవి పంటలుగాను వండ వండనట్లాయ వలపులు నీకైతే యెండలు నీడలు నాయ నిదివో నీకరుణ (॥॥) ననిచెను నీచూపు నంటిననీమేనిమీఁద మొనసెను నానవ్వు ముంచి నీతోను పొనిఁగి పుచ్చఁగఁబుచ్చ వున్నమాయఁ బొద్దునీకు ఇనుము బంగారమాయ నిదివో నీమాటలు (॥॥) తతివచ్చె నాకు నీకు దగ్గరి కాఁగిటిలోన ప్రతివచ్చె నిద్దరికిఁ బాయములివి ఇతవైన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి కతకుఁ గాళ్లువచ్చెఁ గలిగె నీమన్నన English(||pallavi||) pābamaṁṭām̐ bālichchidem̐ baibai nogiliṁtalāya kobamu śhāṁtamudoḍam̐ gūḍĕm̐gā nī sanavu (||||) niṁḍinadi nāmanasu nīmem̐da nebŏddu paṁḍĕnu nāgĕmmovi paṁṭalugānu vaṁḍa vaṁḍanaṭlāya valabulu nīgaide yĕṁḍalu nīḍalu nāya nidivo nīgaruṇa (||||) nanisĕnu nīsūbu naṁṭinanīmenimīm̐da mŏnasĕnu nānavvu muṁchi nīdonu pŏnim̐gi puchcham̐gam̐buchcha vunnamāyam̐ bŏddunīgu inumu baṁgāramāya nidivo nīmāḍalu (||||) tadivachchĕ nāgu nīgu daggari kām̐giḍilona pradivachchĕ niddarigim̐ bāyamulivi idavaina śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi kadagum̐ gāḽluvachchĕm̐ galigĕ nīmannana