Title (Indic)పాప మంటా నోరిచితేఁ బదరీఁ దాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాప మంటా నోరిచితేఁ బదరీఁ దాను కోపగించి యెవ్వతెయైనఁ గుమ్మీ లేవే (॥పాప॥) వంతులకు వచ్చి వచ్చి వలపులే చల్లీని పంతగాఁడు తన కేమి పని లేదా యింత గలితె తన్ను యెవ్వ తైనాఁ బట్టుకొని చెంతనె సదమదము సేసీ లేవే (॥పాప॥) దీమసాన రతులకు దిట్టి తిట్టి పిలిచీని బూమిలోన వీని కేమి పొద్దు వోదా ఆముకొని యింత లేసి ఆసలకు బెనఁగితే గామిడి యెవ్వతె యైనాఁ గలిగీ లేవే (॥పాప॥) తొడిఁబడ నవ్వి నవ్వి దొమ్మి సేసి కాఁగిలించి వొడి వట్టీ వీని కేమి వుండఁ బట్టదా బడినె శ్రీవెంకటపతి నన్ను నిదె కూడె కడ నింకా నివ్వ తైన కాచుకుండీ లేవే English(||pallavi||) pāba maṁṭā norisidem̐ badarīm̐ dānu kobagiṁchi yĕvvadĕyainam̐ gummī leve (||pāba||) vaṁtulagu vachchi vachchi valabule sallīni paṁtagām̐ḍu tana kemi pani ledā yiṁta galidĕ tannu yĕvva tainām̐ baṭṭugŏni sĕṁtanĕ sadamadamu sesī leve (||pāba||) dīmasāna radulagu diṭṭi tiṭṭi pilisīni būmilona vīni kemi pŏddu vodā āmugŏni yiṁta lesi āsalagu bĕnam̐gide gāmiḍi yĕvvadĕ yainām̐ galigī leve (||pāba||) tŏḍim̐baḍa navvi navvi dŏmmi sesi kām̐giliṁchi vŏḍi vaṭṭī vīni kemi vuṁḍam̐ baṭṭadā baḍinĕ śhrīvĕṁkaḍabadi nannu nidĕ kūḍĕ kaḍa niṁkā nivva taina kāsuguṁḍī leve