Maa kemi nee vemta mattu meeri tirigina

మా కేమి నీ వెంత మట్టు మీరి తిరిగిన
Language

(॥పల్లవి॥)
మా కేమి నీ వెంత మట్టు మీరి తిరిగిన
లోకమువారే నవ్వేరు లో వెలుతు లేలరా

(॥మాకేమి॥)
ఆనలు నే కేమిటికి నంత నిజమరి వైతే
కేనాన నీవే బదికేవు గాక
వూని యన్నీ విన్నదాన నుండఁజాల కొక టంటే
కోనలఁ దెలుపు మంటా కొంగు వట్టే వేమిరా

(॥మాకేమి॥)
తారుకాణ లేఁటికి తప్పు లేనివాఁడ వైతే
పేరడి నాచారములు పెంచేవు గాక
కేరి నీవు రాకుంటే వెంగెములు ని న్నాడితేను
పోరి పోరి పోయినిది పోనియ్య వేమిరా

(॥మా కేమి॥)
వట్టిమాఁట లేఁటికి వలచినవాఁడ వైతే
అట్టె అన్నిటను జాణ వయ్యేవు గాక
యిట్టె శ్రీవెంకటేశ యిందుకె నిన్నుఁ గూడితి
దెట్టతెరుపున నన్నుఁ దేలించే మేమిరా

(||pallavi||)
mā kemi nī vĕṁta maṭṭu mīri tirigina
logamuvāre navveru lo vĕludu lelarā

(||māgemi||)
ānalu ne kemiḍigi naṁta nijamari vaide
kenāna nīve badigevu gāga
vūni yannī vinnadāna nuṁḍam̐jāla kŏga ṭaṁṭe
konalam̐ dĕlubu maṁṭā kŏṁgu vaṭṭe vemirā

(||māgemi||)
tārugāṇa lem̐ṭigi tappu lenivām̐ḍa vaide
peraḍi nāsāramulu pĕṁchevu gāga
keri nīvu rāguṁṭe vĕṁgĕmulu ni nnāḍidenu
pori pori poyinidi poniyya vemirā

(||mā kemi||)
vaṭṭimām̐ṭa lem̐ṭigi valasinavām̐ḍa vaide
aṭṭĕ anniḍanu jāṇa vayyevu gāga
yiṭṭĕ śhrīvĕṁkaḍeśha yiṁdugĕ ninnum̐ gūḍidi
dĕṭṭadĕrubuna nannum̐ deliṁche memirā