Title (Indic)మా కాపని గాదు మానివిపైఁ దప్పులేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా కాపని గాదు మానివిపైఁ దప్పులేదు చేకొన్న నాయకుఁడవు నీకడమే పో (॥వకా॥) సిగ్గుల వెలితేకాని చేఁతలవెలితి లేదు యెగ్గువట్టేవుసుమ్మీ నీ వీయింతిని దిగ్గన నాకెసిబ్బితి తేరుచ కుండితే నేఁడు నిగ్గుల నింతటిమీఁద నీకడ మేపొ (॥వకా॥) పంతముచలమే కాని పాయము వెలితి లేదు వంతువాసు లెంచి మోము వంచేవుసుమ్మీ చెఁతల బుజముమీఁద చేయివేసి కుచముల ఇంతటఁ బట్టకుండితే యీకడమేపో (॥వకా॥) రాఁపైనకడమేకాని రతులవెలితి లేదు కొపగించెనంటాను కొంకెవుసుమ్మీ యేపున శ్రీవేంకటేశ ఇంతి నిన్నుఁ దానె కూడె నీపడఁతి నెడసితే నీకడమేపో English(||pallavi||) mā kābani gādu mānivibaim̐ dappuledu segŏnna nāyagum̐ḍavu nīgaḍame po (||vagā||) siggula vĕlidegāni sem̐talavĕlidi ledu yĕgguvaṭṭevusummī nī vīyiṁtini diggana nāgĕsibbidi terusa kuṁḍide nem̐ḍu niggula niṁtaḍimīm̐da nīgaḍa mebŏ (||vagā||) paṁtamusalame kāni pāyamu vĕlidi ledu vaṁtuvāsu lĕṁchi momu vaṁchevusummī sĕm̐tala bujamumīm̐da seyivesi kusamula iṁtaḍam̐ baṭṭaguṁḍide yīgaḍamebo (||vagā||) rām̐painagaḍamegāni radulavĕlidi ledu kŏbagiṁchĕnaṁṭānu kŏṁkĕvusummī yebuna śhrīveṁkaḍeśha iṁti ninnum̐ dānĕ kūḍĕ nībaḍam̐ti nĕḍaside nīgaḍamebo