Title (Indic)కా దనేపాటిదాననా ఘనుఁడు తన మాటకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కా దనేపాటిదాననా ఘనుఁడు తన మాటకు ఆదరించితేఁ దన అంకెలో నుండేనే (॥॥) చెలరేఁగి రమణుని చిత్తము వట్టుటగాక చలపాదితన మేల సకియకును చెలులాల నన్నేల చేరి వొడఁ బరచేరే యెలమిఁదా విచ్చేసితే నెరుట మొక్కేనే (॥॥) ఇయ్యకొని పతి తోడ నిచ్చకమాడుట గాక గయ్యాళితన మేలే కామినికి చెయ్యఁ జెక్కుఁ బట్టి యెంత చేకొని వేఁడుకొనేరే చయ్యనఁ దా మటాడితే సమ్మతించి వినేనే (॥॥) ఇక్కువ శ్రీ వేంకటేశుఁ డేలితేఁ గూడుట గాక తక్కరితనము లే లే తరుణికిని గక్కన నే నలమేల్మంగను పెనఁగెద రేలే అక్కున నన్ను నిలిపె నన్నిటా మెచ్చేనే English(||pallavi||) kā danebāḍidānanā ghanum̐ḍu tana māḍagu ādariṁchidem̐ dana aṁkĕlo nuṁḍene (||||) sĕlarem̐gi ramaṇuni sittamu vaṭṭuḍagāga salabādidana mela sagiyagunu sĕlulāla nannela seri vŏḍam̐ barasere yĕlamim̐dā vichcheside nĕruḍa mŏkkene (||||) iyyagŏni padi toḍa nichchagamāḍuḍa gāga gayyāḽidana mele kāminigi sĕyyam̐ jĕkkum̐ baṭṭi yĕṁta segŏni vem̐ḍugŏnere sayyanam̐ dā maḍāḍide sammadiṁchi vinene (||||) ikkuva śhrī veṁkaḍeśhum̐ ḍelidem̐ gūḍuḍa gāga takkaridanamu le le taruṇigini gakkana ne nalamelmaṁganu pĕnam̐gĕda rele akkuna nannu nilibĕ nanniḍā mĕchchene