Title (Indic)ఇచ్చకాలు రమణికి నెంత చేసేవు నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చకాలు రమణికి నెంత చేసేవు నీ- ముచ్చిమిసేఁతలిన్నియు మూసేటి కొరకా (॥ఇచ్చ॥) బెట్టుగఁ బెద్దతురుము పెట్టేననుచు నింతి- తట్టుపుణుఁగునెరుల తలదువ్వేవు గట్టిగ నెవ్వతెఁ గూడో కౌఁగిటఁదెచ్చిన నీ- తట్టుపుణుఁగుల తావి దాఁచేటికొరకా- (॥ఇచ్చ॥) గబ్బివై నీపదకము గట్టేననుచుఁ జెలి- గుబ్బల మించుఁజెరఁగుకొంగు దీసేవు వుబ్బున నెక్కడనో వుండి నీవిదె వచ్చిన- దెబ్బలవాట్ల తప్పు దీరేటికొరకా (॥ఇచ్చ॥) ఇప్పుడిట్లనే విడెమిచ్చేననుచు నీవు కప్పురము ఘనముగఁ గడునిచ్చేవు అప్పుడె శ్రీ తిరువేంకటాద్రీశ యీ యింతి చొప్పుదప్ప రతిఁగూడి చొక్కించుకొరకా English(||pallavi||) ichchagālu ramaṇigi nĕṁta sesevu nī- muchchimisem̐talinniyu mūseḍi kŏragā (||ichcha||) bĕṭṭugam̐ bĕddadurumu pĕṭṭenanusu niṁti- taṭṭubuṇum̐gunĕrula taladuvvevu gaṭṭiga nĕvvadĕm̐ gūḍo kaum̐giḍam̐dĕchchina nī- taṭṭubuṇum̐gula tāvi dām̐seḍigŏragā- (||ichcha||) gabbivai nībadagamu gaṭṭenanusum̐ jĕli- gubbala miṁchum̐jĕram̐gugŏṁgu dīsevu vubbuna nĕkkaḍano vuṁḍi nīvidĕ vachchina- dĕbbalavāṭla tappu dīreḍigŏragā (||ichcha||) ippuḍiṭlane viḍĕmichchenanusu nīvu kappuramu ghanamugam̐ gaḍunichchevu appuḍĕ śhrī tiruveṁkaḍādrīśha yī yiṁti sŏppudappa radim̐gūḍi sŏkkiṁchugŏragā