Title (Indic)ఇచ్చక మెఱఁగవద్దా యేమే పతి లాలించఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చక మెఱఁగవద్దా యేమే పతి లాలించఁగా రచ్చ వేసేవు వలపు రాఁపులివి యేలే (॥ఇచ్చ॥) సరుస నాతఁడు నీమై జవ్వాది వూయ రాఁగా సరి వెనఁగేవు యింత చలములేలే పరగి జారిని నీ పయ్యద చక్కఁ గప్పఁగా కరము బిగ్గెఁ బట్టేవు కక్కస మింతేలే (॥ఇచ్చ॥) మన్నించి యాతఁడు నీతో మంచి మాఁట లాడఁగాను సన్నల జంకించేవు యీసణఁగులేలే మిన్నక కొసరి తనమీఁద నానవెట్టఁగాను పన్ని నోరుమూసేవు పంతా లింత యేలే (॥ఇచ్చ॥) మొక్కలాన నాతఁడు నీమోవితేనె లానఁగాను వుక్కు గోర నూఁదే వింత వుద్దండాలేలే చెక్కు నొక్కి నిన్ను నిట్టె శ్రీవేంకటేశుఁ డేలఁగా మొక్కుచు వీఁగేవు వట్టి మొఱఁగు విఁకేలే English(||pallavi||) ichchaga mĕṟam̐gavaddā yeme padi lāliṁcham̐gā rachcha vesevu valabu rām̐pulivi yele (||ichcha||) sarusa nādam̐ḍu nīmai javvādi vūya rām̐gā sari vĕnam̐gevu yiṁta salamulele paragi jārini nī payyada sakkam̐ gappam̐gā karamu biggĕm̐ baṭṭevu kakkasa miṁtele (||ichcha||) manniṁchi yādam̐ḍu nīdo maṁchi mām̐ṭa lāḍam̐gānu sannala jaṁkiṁchevu yīsaṇam̐gulele minnaga kŏsari tanamīm̐da nānavĕṭṭam̐gānu panni norumūsevu paṁtā liṁta yele (||ichcha||) mŏkkalāna nādam̐ḍu nīmovidenĕ lānam̐gānu vukku gora nūm̐de viṁta vuddaṁḍālele sĕkku nŏkki ninnu niṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelam̐gā mŏkkusu vīm̐gevu vaṭṭi mŏṟam̐gu vim̐kele