Title (Indic)ఇచ్చక మెఱఁగవద్దా ఇంతవాఁడవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చక మెఱఁగవద్దా ఇంతవాఁడవు కచ్చు పెట్టుకున్న దానిఁ గాకు సేతురా (॥॥) చెలియను నవ్వించఁగా చిరుచెమటలు గారీ అలయింతురా నీవు ఆఁటదానిని సెలవులనవ్వులతో సిగ్గులు వడియఁ గాను బలిమి నాపెచన్నులు పట్టవచ్చునా (॥॥) అట్టె మాటలాడించఁ గా నదరము వసివాడీ పెట్టుదురా గాసి నింత ప్రియురాలిని చుట్టరికములెల్లాను చూపులనే తెలుపఁగా గుట్టులేక కొప్పువీడఁ గొంగువట్టితీతురా (॥॥) సారెఁ గాఁగిటఁ గూడఁగా జడిసీ మైఁబులకలు మేరమీరుదురా యలమేలుమంగను యీరీతి శ్రీ వేంకటేశ యీకె నిన్నుఁ గూడఁగాను పేరెడిసరసములఁ బెనఁగ సంగతులా English(||pallavi||) ichchaga mĕṟam̐gavaddā iṁtavām̐ḍavu kachchu pĕṭṭugunna dānim̐ gāgu sedurā (||||) sĕliyanu navviṁcham̐gā sirusĕmaḍalu gārī alayiṁturā nīvu ām̐ṭadānini sĕlavulanavvulado siggulu vaḍiyam̐ gānu balimi nābĕsannulu paṭṭavachchunā (||||) aṭṭĕ māḍalāḍiṁcham̐ gā nadaramu vasivāḍī pĕṭṭudurā gāsi niṁta priyurālini suṭṭarigamulĕllānu sūbulane tĕlubam̐gā guṭṭulega kŏppuvīḍam̐ gŏṁguvaṭṭidīdurā (||||) sārĕm̐ gām̐giḍam̐ gūḍam̐gā jaḍisī maim̐bulagalu meramīrudurā yalamelumaṁganu yīrīdi śhrī veṁkaḍeśha yīgĕ ninnum̐ gūḍam̐gānu perĕḍisarasamulam̐ bĕnam̐ga saṁgadulā