ఇచ్చటనుండీ నేల యే నిన్ను వేసరించ
(॥పల్లవి॥)
ఇచ్చటనుండీ నేల యే నిన్ను వేసరించ
అప్పుడు చెప్పే నీకు నందపు నా బుద్దులు
(॥ఇప్ప॥)
నామాటలే నీకు నంటునఁ జవాయనా
కామినులమాటలెల్లఁగాదనేవు
చేముట్టిననాసేవ చిత్తానకు వచ్చెనా
కామించినసేవలెల్లా కడకుఁ దోసేవు
(॥ఇప్ప॥)
నాతోడినవ్వే నీకు నయములై వుండెనా
ఆతలివారినవ్వులందుఁ జొరవు
యీతల నేనునీకు నితవరినైతినా
యేతులవారినవ్వు లియ్యకొనే(న?) వు
(॥ఇప్ప॥)
నిక్కము నాకూటములే నీకుఁ బ్రియమాయనా
అక్కడసవతులపొం దాసవడవు
నెక్కొని శ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
వెక్కసపువారిఁ జూచి వెరగునొందేవు
(||pallavi||)
ichchaḍanuṁḍī nela ye ninnu vesariṁcha
appuḍu sĕppe nīgu naṁdabu nā buddulu
(||ippa||)
nāmāḍale nīgu naṁṭunam̐ javāyanā
kāminulamāḍalĕllam̐gādanevu
semuṭṭinanāseva sittānagu vachchĕnā
kāmiṁchinasevalĕllā kaḍagum̐ dosevu
(||ippa||)
nādoḍinavve nīgu nayamulai vuṁḍĕnā
ādalivārinavvulaṁdum̐ jŏravu
yīdala nenunīgu nidavarinaidinā
yedulavārinavvu liyyagŏne(na?) vu
(||ippa||)
nikkamu nāgūḍamule nīgum̐ briyamāyanā
akkaḍasavadulabŏṁ dāsavaḍavu
nĕkkŏni śhrīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
vĕkkasabuvārim̐ jūsi vĕragunŏṁdevu