Title (Indic)ఇపుడునుఁ గల్ల నిజ మేరుపడ దిది మాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇపుడునుఁ గల్ల నిజ మేరుపడ దిది మాకు కొప్పుపవ్వులు రాలెఁ గొసరు పైననఁగా (॥ఇపు॥) కాంత నీనెన్నుదుటికమ్మఁ గస్తూరిబొట్టు పంతమునఁ జెలుల నిటు భ్రమఇంచెనే కంతుసమరము గెల్చి కడనారెఁ బగదీర ఇంత నెత్తురున బోట్టిడుకోనినగతిని (॥ఇపు॥) పడఁతి నీవురముపై పచ్చిపగడపుదండ బడిబడినే మమ్ము నిటు భ్రమఇంచెనే కడలేనిచలిగాలిఁ గలనిలోపల గెల్చి వెడఁ బేగుంజంధ్యములు వేసితివోయనఁగ (॥ఇపు॥) చెలియ నీమెయిఁ బోడముచెమటముత్తెపుసరము పలుమారుమమ్ము నిటు భ్రమయించెనే వలచి శ్రీవేంకటేశ్వరుఁ గూడి చందురుని బలిగొనుచు వెన్నెలలు పైఁ గురిసితనఁగా English(||pallavi||) ibuḍunum̐ galla nija merubaḍa didi māgu kŏppubavvulu rālĕm̐ gŏsaru painanam̐gā (||ibu||) kāṁta nīnĕnnuduḍigammam̐ gastūribŏṭṭu paṁtamunam̐ jĕlula niḍu bhrama̮iṁchĕne kaṁtusamaramu gĕlsi kaḍanārĕm̐ bagadīra iṁta nĕtturuna boṭṭiḍugoninagadini (||ibu||) paḍam̐ti nīvuramubai pachchibagaḍabudaṁḍa baḍibaḍine mammu niḍu bhrama̮iṁchĕne kaḍalenisaligālim̐ galanilobala gĕlsi vĕḍam̐ beguṁjaṁdhyamulu vesidivoyanam̐ga (||ibu||) sĕliya nīmĕyim̐ boḍamusĕmaḍamuttĕbusaramu palumārumammu niḍu bhramayiṁchĕne valasi śhrīveṁkaḍeśhvarum̐ gūḍi saṁduruni baligŏnusu vĕnnĕlalu paim̐ gurisidanam̐gā