Ibudela sigguvade vimdarilona

ఇపుడేల సిగ్గువడే విందరిలోన
Language

(॥పల్లవి॥)
ఇపుడేల సిగ్గువడే విందరిలోన
వుప్పతిల నాపె రతి నోలలాడవా

(॥ఇపు॥)
గుత్త పుగుబ్బలతాఁకులకు నొడ్డించుకొంటా
హత్తి యాపెతో సరసమాడవా నీవు
జోత్తుగా మోవియుమోవి సోఁకఁగా నోరుదెఱచి
బత్తితోడఁ దమ్ములము పడఁతి కొసఁగవా

(॥ఇపు॥)
వడియుబెంజెమటలవానలఁ దడుసుకొంటా
కడుఁగడుఁ బెనఁగవా చాఁచి కాంతతోడను
తోడపైఁ బాదాలు చాఁచి తోరలింపునవ్వులతో
చిడుముడిచేఁతలెల్లఁ జేయవా ఆపెతోను

(॥ఇపు॥)
కోప్పువిరులవాసన గొలుకొంటాఁ గాఁగిలించి
మెప్పించి కూడవా యలమేలుమంగను
ముప్పిరి శ్రీవేంటేశ మోహించి యాపె నురాన
యెప్పుడుఁ బెట్టుకుండవా యేలితివి నన్నును

(||pallavi||)
ibuḍela sigguvaḍe viṁdarilona
vuppadila nābĕ radi nolalāḍavā

(||ibu||)
gutta pugubbaladām̐kulagu nŏḍḍiṁchugŏṁṭā
hatti yābĕdo sarasamāḍavā nīvu
jottugā moviyumovi som̐kam̐gā norudĕṟasi
battidoḍam̐ dammulamu paḍam̐ti kŏsam̐gavā

(||ibu||)
vaḍiyubĕṁjĕmaḍalavānalam̐ daḍusugŏṁṭā
kaḍum̐gaḍum̐ bĕnam̐gavā sām̐si kāṁtadoḍanu
toḍabaim̐ bādālu sām̐si toraliṁpunavvulado
siḍumuḍisem̐talĕllam̐ jeyavā ābĕdonu

(||ibu||)
koppuvirulavāsana gŏlugŏṁṭām̐ gām̐giliṁchi
mĕppiṁchi kūḍavā yalamelumaṁganu
muppiri śhrīveṁṭeśha mohiṁchi yābĕ nurāna
yĕppuḍum̐ bĕṭṭuguṁḍavā yelidivi nannunu