Title (Indic)గక్కున నింట లేనిది గానుగకాడ నున్నదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గక్కున నింట లేనిది గానుగకాడ నున్నదా నక్కువడ నిందుకే పో నవ్వితి నే ననరే (॥॥) తా నేడనుండిన నేమి తలఁ పొక్కటైనఁ జాలు ఆనలు సత్యాలఁ జెప్పి యంపవలెనా దానికే మెదురుమాట తనతో నే నాడేనా మోనాన నిట్టె తనకు మొక్కితి నే ననరే (॥॥) యేదిక్కు చూచిననేమి యీడకు విచ్చేసెఁ జాలు యీదెస నొడఁబరచ నింతవలెనా కాదని తనచేఁతలు ఖండించఁజెల్లునా వాదు లడువక తలవంచితి నే ననరే (॥॥) అసురుసు రై తేనేమి అట్టె నన్నుఁ గూడెఁ జాలు వసమై నాకిఁక వెరవఁగవలెనా యెసఁగి శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్ను మన్నించె రసికుఁడు తాను నారపమాయ ననరే English(||pallavi||) gakkuna niṁṭa lenidi gānugagāḍa nunnadā nakkuvaḍa niṁduge po navvidi ne nanare (||||) tā neḍanuṁḍina nemi talam̐ pŏkkaḍainam̐ jālu ānalu satyālam̐ jĕppi yaṁpavalĕnā dānige mĕdurumāḍa tanado ne nāḍenā monāna niṭṭĕ tanagu mŏkkidi ne nanare (||||) yedikku sūsinanemi yīḍagu vichchesĕm̐ jālu yīdĕsa nŏḍam̐barasa niṁtavalĕnā kādani tanasem̐talu khaṁḍiṁcham̐jĕllunā vādu laḍuvaga talavaṁchidi ne nanare (||||) asurusu rai tenemi aṭṭĕ nannum̐ gūḍĕm̐ jālu vasamai nāgim̐ka vĕravam̐gavalĕnā yĕsam̐gi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannu manniṁchĕ rasigum̐ḍu tānu nārabamāya nanare