Title (Indic)గక్కనఁ జెప్పవే యెన్ని కతలఁ గరచితివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గక్కనఁ జెప్పవే యెన్ని కతలఁ గరచితివి చొక్కముగా నిన్నుఁ జూచి సోద్యమయ్యీ నాకు (॥గక్క॥) చిన్ని పెదవుల నట్టె చెప్పేవు సుద్దులెల్లా యెన్నిక నీతనికి నీ వేమౌదువే కన్నులఁ దప్పక చూచి కరఁగేవు మనసున పన్నినవల పతనిపై నెంత గలదే (॥గక్క॥) మలయుచు నూడిగాలు మాపు దాఁకాఁ జేసేవే ఇల నితనికి నీకు నెన్నటి పొందే పెలుచుఁ జన్ను లదర పెనఁగి వేఁడుకొనేవు చలిమి బలిమి నీకు సలిగెంత గలదే (॥గక్క॥) నాటకపు ప్రేమతోడ నవ్వు లెల్లా నవ్వేవు యీటుతో నీయాస ఇంకా నెంతగలదే చాలువగా శ్రీవేంకటేశ్వరుఁ డిట్టె నన్ను నేలె చాటుననే మొక్కేవు నీసలిగెంత గలదే English(||pallavi||) gakkanam̐ jĕppave yĕnni kadalam̐ garasidivi sŏkkamugā ninnum̐ jūsi sodyamayyī nāgu (||gakka||) sinni pĕdavula naṭṭĕ sĕppevu suddulĕllā yĕnniga nīdanigi nī vemauduve kannulam̐ dappaga sūsi karam̐gevu manasuna panninavala padanibai nĕṁta galade (||gakka||) malayusu nūḍigālu mābu dām̐kām̐ jeseve ila nidanigi nīgu nĕnnaḍi pŏṁde pĕlusum̐ jannu ladara pĕnam̐gi vem̐ḍugŏnevu salimi balimi nīgu saligĕṁta galade (||gakka||) nāḍagabu premadoḍa navvu lĕllā navvevu yīḍudo nīyāsa iṁkā nĕṁtagalade sāluvagā śhrīveṁkaḍeśhvarum̐ ḍiṭṭĕ nannu nelĕ sāḍunane mŏkkevu nīsaligĕṁta galade